కరోనా వల్ల ఉద్యోగం పోయింది.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. కాల్చి పారేసిన సిగరెట్ పీకలతో..
ABN , First Publish Date - 2021-09-16T03:40:11+05:30 IST
కరోనాతో ఉద్యోగం పోతే..సిగరెట్ పీకలతో లైఫ్ సెటిలైంది.. ఇదెలాగంటే...
ఇంటర్నెట్ డెస్క్: కరోనా దెబ్బకు దేశంలో ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు. వారిలో ట్వింకిల్ కుమార్ కూడా ఒకరు. పంజాబ్‌కు చెందిన ఆయన కూడా అకస్మాత్తుగా ఉద్యోగాన్ని కోల్పోవడంతో భారీ షాక్‌కు గురయ్యారు. అయితే..ఆయన ఇలాగే చతికిలపడిపోకుండా తన మెదడుకు మరింత పదును పెట్టారు. ఇంటర్నెట్‌ను జల్లెడ పట్టారు. కొత్త ఉపాధి మార్గాల కోసం విస్తృతంగా అన్వేషించారు.
ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో వీడియో ఒకటి ఆయన కంట పడింది. వాడిపారేసిన సిగరెట్ పీకలతో ఎలా ఆర్జించవచ్చో ఇందులో చూపించారు. ఇది ట్వింకిల్‌ను అమితంగా ఆకర్షించింది. కొత్తగా ఏమైనా ట్రై చేస్తే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ట్వింకిల్ వెంటనే.. ఈ సంపాదన మార్గాన్నే ఎంచుకున్నారు. ఈ క్రమంలో తాను నిలదొక్కుకోవడమే కాకుండా.. మరికొందరికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. వాడిపారేసిన సిగరెట్ పీకలతోనే ఇదంతా సాధ్యమైంది! అదెలాగంటే..
పంజాబ్ రాష్ట్రం మొహాలీకి చెందిన ట్వింకిల్‌ను సిగరెట్ పీకల రిసైక్లింగ్ అంశం బాగా ఆకట్టుకుంది. దీని గురించి తొలిసారి యూట్యూబ్‌లో ట్వింకిల్ చూశారు. ఆ తరువాత..ఇదే పనిలో నిమగ్నమై ఉన్న ఓ సంస్థను సంప్రదించి ఇందులోని లోటుపాట్ల గురించి తెలుసుకున్నారు. విషయం అంతా ఆకళింపు చేసుకున్నాక దీన్నే తన సంపాదనా మార్గంగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన వాడిపారేసిన సిగరెట్ పీకలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేస్తూ.. దోమల బత్తీలు, బొమ్మలు వంటివి తయారు చేశారు. ఇందుకోసం ఓ ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇలా రీసైకిల్డ్ వస్తువులను విక్రయించడం ద్వారా మంచి ఆదాయాన్ని అందుకున్నారు.
ఇవీ చదవండి:
SBI లో భారీ మోసం.. అసిస్టెంట్ మేనేజర్ పక్కా స్కెచ్.. కస్టమర్లకు తెలియకుండానే ఖాతాల్లోంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి..
యువకుడికి భారీ షాకిచ్చిన న్యాయస్థానం.. సత్ప్రవర్తన హామీపై విడుదల చేయాలని కోరితే.. న్యాయమూర్తి ఇలా..
వ్యాపారం ముందుకెళుతుండటంతో.. ఆయన స్థానికంగా ఉండే మరికొంత మంది మహిళలను తన సంస్థలో చేర్చుకుని పెద్ద ఎత్తున సిగరెట్ పీకలను సేకరించడం ప్రారంభించారు. ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసి మరీ వీటిని సేకరిస్తున్నారు. ఈ తరహా వ్యాపారం లాభసాటిగా మారి ట్వింకిల్‌కు మంచి ఆదాయాన్నే తెచ్చిపెట్టింది. దీంతో..స్థానికంగా బాగా పాపులర్ అయిపోయారు. మొదట యూట్యూబ్ ద్వారానే తనకు దీనికి గురించి తెలిసిందనీ.. ఇప్పటివరకూ ఈ రీసైకిల్డ్ వస్తువుల పట్ల ప్రజల స్పందన కూడా బాగానే ఉందని ఆయన జాతీయ ఛానల్‌కు ఇచ్చిన తాజాగా ఇంటర్వ్యూలో తెలిపారు.