Abn logo
Oct 13 2021 @ 18:32PM

బొగ్గు కొరత, విద్యుత్తు కోత... పంజాబ్ విలవిల

న్యూఢిల్లీ : బొగ్గు సంక్షభంతో పంజాబ్ రాష్ట్రం కూడా  అతలాకుతలమవుతోంది. మొత్తం ఉత్తర భారతదేశంలో... పంజాబ్  రాష్ట్రం అత్యధికంగా విద్యుత్తు కొరతను ఎదుర్కొంటోంది. అక్టోబరు 11 న రాష్ట్రంలో దాదాపు 2,300 మెగావాట్ల కొరత ఏర్పడింది. విద్యుత్తు కొరత కారణంగా పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్తుకోతలు మొదలయ్యాయి. బొగ్గు కొరత కారణంగా  విద్యుదుత్పత్తి దారుణంగా పడిపోయింది.


ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో మూడు థర్మల్ ప్లాంట్లు మూతపడ్డాయి. ఈ క్రమంలో తమ రాష్ట్రానికి విద్యుదుత్పత్తి కోసం బొగ్గు సరఫరాను పెంచాలని కేంద్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ విజ్ఞప్తి చేశారు. పంజాబ్ రాష్ట్రంలో 5620 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు ఉన్నప్పటికీ, అందులో సగం కూడా విద్యుదుత్పత్తి కాకపోవడంపై ఆయన కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. బొగ్గు కొరత కారణంగా మిగతా థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా మూతపడే ప్రమాదముందని, అలా జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇతర రాష్ట్రాల నుండి, ప్రైవేటు సంస్థల నుండి విద్యుత్తు కొనుగోలు... 

విద్యుదుత్పత్తి తగ్గడంతో విద్యుత్తును ప్రైవేటు సంస్థలు, పొరుగు రాష్ట్రాల నుంచి పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్   కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది రాష్ట్రానికి తలకు మించిన భారంగా మారింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 4-7 గంటల వరకు విద్యుత్తు కోతలను విధించారు. 


ఇవి కూడా చదవండిImage Caption