భక్తులు లేకుండా పూరి జగన్నాథ రథయాత్ర

ABN , First Publish Date - 2021-07-10T13:51:13+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఎల్లుండి(జులై 12) జరగనుంది....

భక్తులు లేకుండా పూరి జగన్నాథ రథయాత్ర

సేవకులకు వ్యాక్సినేషన్, కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి

పూరి (ఒడిశా): కరోనా నేపథ్యంలో ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఎల్లుండి(జులై 12) జరగనుంది. వరుసగా రెండో ఏడాది కూడా జగన్నాథ రథయాత్రను భక్తులు లేకుండానే చేపట్టాలని నిర్ణయించారు. పూరీ రథాన్ని లాగేందుకు 3వేల మంది సేవకులను కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ అనుమతించాలని నిర్ణయించారు. రథయాత్రలో 3వేల మంది సేవకులు, 1000 మంది ఆలయ ఉద్యోగులు, పోలీసులు పాల్గొననున్నారు. పూరి రథయాత్రలో పాల్గొనే వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలని ఆలయ అధికారులు చెప్పారు. దీంతోపాటు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారినే రథయాత్రలో సేవకులుగా అనుమతిస్తామని అధికారులు వివరించారు. దీని కోసం రథయాత్రలో పాల్గొనే సేవకులకు కరోనా పరీక్షలు చేస్తున్నామని పూరి జగన్నాథ్ ఆలయ అధికారి అజయ్ జెనా చెప్పారు.జగన్నాథ రథయాత్రను కేవలం పూరిలోనే పరిమితమైన సేవకులతో భక్తులు లేకుండా జరిపేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేశారు.


Updated Date - 2021-07-10T13:51:13+05:30 IST