ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ జాతర

ABN , First Publish Date - 2021-01-18T05:51:53+05:30 IST

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన జైనథ్‌ మండలంలోని పూసాయి గ్రామంలో ఆదివారం నుంచి ఎల్లమ్మ (దుర్గామాత) జాతర ప్రారంభమైంది.

ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ జాతర
పూసాయి జాతరకు పోటెత్తిన భక్తులు

నెల రోజుల పాటు కొనసాగే ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే అతిపెద్ద జాతర 

జిల్లా నలుమూలలతో పాటు మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న భక్తజనం

జైనథ్‌, జనవరి 17: ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన జైనథ్‌ మండలంలోని పూసాయి గ్రామంలో ఆదివారం నుంచి ఎల్లమ్మ (దుర్గామాత) జాతర ప్రారంభమైంది. పుష్యమాసం నుంచి మాగమాసం వరకు నెల రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం వేలాది మంది భక్తులు హాజరై తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉం డాలని ఎల్లమ్మ తల్లికి బోనాలను మహిళలు సమర్పించారు. దీంతో పాటు ఆల యం ముందు ఉన్న కోనేరులో స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని ప్రతీతి. పంటలకు ఆశించిన క్రిమికీటకాలు సైతం కోనేరు నీటితో పోతాయని ప్రజల నమ్మకం. నెలపాటు కొనసాగే ఈ జాతర లో ఎలాంటి అవాంతరాలు జరుగకుండా  ఎస్సై సాయిరెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులను కల్పించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ఆల య చైర్మన్‌ బుద్దె సంజీవ్‌, వైస్‌ చైర్మన్‌ కిరణ్‌, చిన్నయ్య, ఆయా గ్రామాల భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:51:53+05:30 IST