Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యతకు పాతర

ముండ్లమూరు, డిసెంబరు 5 : మండలంలోని సింగన్నపాలెం సమీపంలో దోర్నపాకు వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. దీంతో ఆ పనులను ఇటీవల గ్రామస్థులు నిలిపివేయించారు. రూ.50 లక్షల నిధులతో ప్రస్తుతం ఉన్న వంతెనను మరికొంత వెడల్పు చేస్తున్నారు. ఇటీవల సంబంధిత కాంట్రాక్టర్‌ కాంక్రీట్‌ పనులు నాసిరకంగా పనులు చేస్తున్నాడు. వంతెన నిర్మాణానికి వాడుతున్నపైపులు కూడా నాసిరకంగా ఉండడంతో పాటు బ్రిడ్జికి వాడుతున్న పైపులు సైతం నాసిరకంగా ఉన్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పది కాలాల పాటు ఉండాల్సిన బ్రిడ్జి నిర్మాణ పనులు పక్కాగా నాణ్యతకు తిలోధకాలు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా కాంక్రీట్‌ పనుల్లో లూజు మట్టి తీయకుండా నీరు తోడకుండా కాంక్రీట్‌ పనులు చేస్తున్నారు. వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పైపులు సైతం పగుళ్లిచ్చాయి. ఇప్పటికైనా అధికారులుస్పందించి నాణ్యతా ప్రమాణాలతో బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.  

ప్రమాణాలు పాటిస్తున్నాం : రఫీ, ఏఈ

 మండలంలోని సింగన్నపాలెం సమీపంలో దోర్నపాగు వాగుపై నిర్మిస్తున్న నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం. పైపులు పగిలి ఉంటే వాటిని మార్చి కొత్తవి తీసుకొస్తాం. గ్రామస్థుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.

Advertisement
Advertisement