Cyberabad Police కొత్త ప్రయోగం.. మహిళలకు అండగా క్విక్‌ రెస్పాన్స్‌ టీం

ABN , First Publish Date - 2021-08-21T14:54:25+05:30 IST

మహిళలపై గృహహింస, వేధింపులు, లైంగిక దాడులు, లింగ వివక్షను చాలా మంది మౌనంగా భరిస్తున్నారు...

Cyberabad Police కొత్త ప్రయోగం.. మహిళలకు అండగా క్విక్‌ రెస్పాన్స్‌ టీం

  • కాల్‌ చేసిన వెంటనే సంఘటనా స్థలానికి..


హైదరాబాద్‌ సిటీ : మహిళలపై గృహహింస, వేధింపులు, లైంగిక దాడులు, లింగ వివక్షను చాలా మంది మౌనంగా భరిస్తున్నారు. పరువు పోతుందని, అల్లరి పాలవుతామని, కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకని భావిస్తున్నారు. అలాంటి వారికి డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్‌ టీంలు అండగా నిలుస్తున్నాయి. సీపీ సజ్జనార్‌ ఆలోచన లోంచి పుట్టిన ఈ క్విక్‌ రెస్పాన్స్‌ టీం... డయల్‌ 100 ఫోన్‌ చేస్తే చాలు వెంటనే స్పందించి, వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. పరిస్థితి విషమించితే నిందితులను ఠాణాలకు తరలించి, క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తోంది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటికే 11 షీటీమ్స్‌ బృందాలు పని చేస్తుండగా, క్విక్‌ రెస్పాన్స్‌ టీంలు అదనంగా పని చేస్తున్నాయి. బాధిత మహిళల్లో మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు, అవసరాన్ని బట్టి వారిని భరోసా సెంటర్‌లకు పంపి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.


ధైర్యంగా ముందుకు రావాలి..

బాధితులు ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు పోలీస్‌ టీంలు మీ వద్దకు వస్తాయి. మరోసారి మహిళల జోలికి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. బాధిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి డయల్‌-100, 9490617444కు ఫోన్‌ చేయొచ్చు. - అనసూయ, డీసీపీ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌, సైబరాబాద్‌

Updated Date - 2021-08-21T14:54:25+05:30 IST