రాజీమార్గం ద్వారానే సత్వర పరిష్కారం

ABN , First Publish Date - 2021-04-11T07:05:26+05:30 IST

కక్ష్యిదారుల కేసులు రాజీమార్గం ద్వార సత్వర పరిష్కారమవుతాయని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల పరిష్కారం కోసం శనివారం జిల్లా కోర్టులోని న్యాయసేవ అధికార సంస్థ సమావేశ మందిరంలో జాతీయ లోక్‌ ఆదాలత్‌ కార్య

రాజీమార్గం ద్వారానే సత్వర పరిష్కారం
ఆదిలాబాద్‌లో కక్ష్యిదారుల కేసులను అడిగి తెలుసుకుంటున్న న్యాయమూర్తి

ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌ 

జాతీయ లోక్‌ అదాలత్‌లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం పట్ల హర్షం

ఆదిలాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 10: కక్ష్యిదారుల కేసులు రాజీమార్గం ద్వార సత్వర పరిష్కారమవుతాయని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల పరిష్కారం కోసం శనివారం జిల్లా కోర్టులోని న్యాయసేవ అధికార సంస్థ సమావేశ మందిరంలో  జాతీయ లోక్‌ ఆదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన  న్యాయమూర్తి ఆధ్వరంలో సివిల్‌, బ్యాంకులతో పాటు భూమి, ఇతర కేసులను పరిష్కరించేందుకు రాజీమార్గం ద్వారా కక్ష్యిదారులను ఒప్పించారు. అంతకుముం దు కేసుల పరిష్కారం కోసం జిల్లా కోర్టుకు కక్ష్యిదారులు పెద్దఎత్తున తరలివచ్చా రు. దీంతో వివిధ బ్యాంకు రుణాలతో పాటు సివిల్‌, దొంగతనాలు, ప్రమాదాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కేసులను పెద్ద మొత్తంలో పరిష్కారానికి వచ్చాయి. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయవ్యాప్తంగా ఒక్కరోజులోనే మొత్తం 7,807 కేసుల పరిష్కారంతో రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లా మొదట్టి స్థానంలో ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే, కక్ష్యిదారులు తమ కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక బృహత్తర అవకాశాన్ని కల్పించేందుకు లోక్‌ అదాలత్‌ను నిర్వహించిందన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్‌ పోలీసులు, పోలీసులు వివిధ సందర్బాల్లో రోడ్డు నియమ, నిబంధనలు పాటించని వారికి  విధించిన జరిమానాలను చెల్లించేందుకు సదరు వాహనదారులు కోర్టుకు బారులు తీరారు. ఇందులో న్యాయమూర్తులు శ్రీకాంత్‌రావ్‌, చౌహాన్‌, న్యాయవాదులు రమణారెడ్డి, నగేష్‌, రమేష్‌, మధుకర్‌, నాగేశ్వర్‌, సంజయ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌: మండల కేంద్రంలోని మున్సిఫ్‌ మేజిస్ర్టేట్‌ కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఇందులో జూనియర్‌ సివిల్‌ జడ్జి పీబీ కిరణ్‌కుమార్‌ కేసులను పరిశీలించి 306 కేసులను పరిష్కరించారు. రాజీమార్గం ద్వారా 30క్రిమినల్‌, 2 సివిల్‌ తగాదాలను, 2 ప్యామిలీ, 1 చెక్‌బోన్స్‌ కేసును పరిష్కరించా రు. నేరాలను ఒప్పుకోవడం ద్వారా 271 కేసులలో జరిమానాలు విధించారు. 

ఉట్నూర్‌: ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు శనివారం స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 200 కేసులను పరిష్కరించినట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి కే.సుధాకర్‌ తెలిపారు. రాజీమార్గం ద్వారా ఇరు వర్గాల సమ్మతంతో కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు.  

Updated Date - 2021-04-11T07:05:26+05:30 IST