సరిహద్దులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఎస్పీ రవీంద్రనాథ్‌

ABN , First Publish Date - 2020-04-05T09:07:06+05:30 IST

జిల్లా సరిహద్దులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్టు ఎస్సీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.

సరిహద్దులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఎస్పీ రవీంద్రనాథ్‌

 కైకలూరు: జిల్లా సరిహద్దులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్టు ఎస్సీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కైకలూరు మండలం ఆలపాడు శివారు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులను శనివారం పరిశీలించారు. సరిహద్దులో ప్రతివాహ నాన్ని క్షుణ్ణంగా తనిఖీచేయాలన్నారు. సరిహద్దులో పోలీసు సిబ్బంది చేసిన ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు బందోబస్తు కొనసాగించాలన్నారు. డీఎస్పీ సత్యానందం, సీఐ లక్ష్మీనాయుడు, రూరల్‌ ఎస్సై టి.రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


కైకలూరు పరిసర ప్రాంతాల్లోని 300 మందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు శనివారం ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  పనీ, పాట లేకుండా రోడ్లపై తిరుగు తున్న వారిపై  జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 700 కేసులు నమోద య్యాయన్నారు. వలస కూలీలు ఇబ్బందులకు గురైతే నోడల్‌ అధికారి ద్వారా ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే  దూలం మాట్లాడుతూ పోలీసు లు, వైద్యుల సేవలను కొనియాడారు.   


గుడివాడలో పరిశీలన

గుడివాడ(రాజేంద్రనగర్‌)  : ప్రజలంతా  లాక్‌డౌన్‌కు సహకరిస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని గుడివాడ ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌, డీఎస్పీ ఎన్‌.సత్యానందం అన్నారు. గుడివాడలో లాక్‌డౌన్‌ పరిస్థితులను శనివారం పరిశీలించి పని లేకుండా రోడ్ల పైకి వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో రైతుబజారు నిర్వహణ, నిత్యావసరాల విక్రయాలను మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌తో చర్చించారు.


సీపెట్‌ యాజమాన్యం రూ. 2లక్షలు అందజేత

నూజివీడు టౌన్‌ :  కరోనా విజృంభిస్తున్న తరుణంలో దాతలు సామాజిక బాధ్యతతో వ్యవహరిం చాలని నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అన్నారు. గన్న వరం మండలం సూరంపల్లిలోని సీపెట్‌ యాజమాన్యం కరోనా నియంత్రణకు రూ.2లక్షల చెక్కును సబ్‌ కలెక్టర్‌కు అందించారు.  సీపెట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ డి.ఆంజనేయశర్మ, అసిస్టెంట్‌ అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి ఎస్‌వికే బట్టా పాల్గొన్నారు. నూజివీడులో రెండోరోజు కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు మొబైల్‌ రైతుబజార్‌లు నిర్వహించారు. 


 అప్రమత్తంగా ఉండండి : ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు

నందిగామ, చందర్లపాడు: కరోనా మహమ్మారి పల్లెలకు సైతం పాకుతోందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు అన్నారు.  తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమా వేశంలో డీఎస్పీ రమణమూర్తి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ పాల్గొ న్నారు. ముప్పాళ్ల గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను ఎమ్మెల్యే, డీఎస్పీ రమణమూర్తి శనివారం పరిశీలించారు.


ఎమ్మెల్యే రక్షణనిధి పర్యటన

విస్సన్నపేట: తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి శనివారం విస్సన్నపేట, నర్సాపురం గ్రామాల్లో పర్యటించారు.   పోలీస్‌ స్టేషన్‌లో గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్‌లను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులుతో కలసి పంపిణీ చేశారు.


 లాక్‌డౌన్‌ పాటించని వారిపై కేసు

తోట్లవల్లూరు: లాక్‌డౌన్‌ పాటించకుండా గుంపులుగా ఉన్న పదిమందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై వై.చిట్టిబాబు తెలిపారు. వల్లూరుపాలెంలో పేకాటరాయుళ్లను అరెస్టు చేశామన్నారు. 

Updated Date - 2020-04-05T09:07:06+05:30 IST