Abn logo
Jun 22 2021 @ 14:20PM

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలి: రఘురామ

న్యూఢిల్లీ: ఏపీ శాసనమండలి రద్దుకు సహకరించాలని, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్రమంత్రులకు లేఖలు రాశారు. రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషికి ఈ మేరకు లేఖ రాశారు. మండలి రద్దు చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, గతంలో కూడా ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. మండలి రద్దుకు సంబంధించి సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ నిన్న ఆయనకు రఘురామ లేఖ రాశారు. కాగా నిన్న కొత్తగా నలుగురు కొత్త సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ మండలి రద్దుకు కట్టబడి ఉన్నామని స్పష్టం చేశారు.  మండలి రద్దుకు తమవంతు కృషి చేస్తామని, కేంద్రానికి చెబుతామని నిన్న రాఘురామ ఓ ప్రకటన చేశారు. అందులో భాగంగా మంగళవారం ఆయన కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు.