Abn logo
Aug 22 2021 @ 15:51PM

నా జీవితంలో ప్రియాంకకు ప్రత్యేక స్థానం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. తామిద్దరమూ ఒకరికొకరం స్నేహితులమని, రక్షకులమని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇచ్చిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆమెతో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. 


‘‘మా చెల్లి ఆప్యాయత, సహకారాలకు నా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. మేం ఒకరికొకరం స్నేహితులం, రక్షకులం. రక్షా బంధన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 


ప్రియాంక గాంధీ వాద్రా కూడా రాఖీ పండుగ సందర్భంగా ట్విటర్ వేదికగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సోదరసోదరీమణులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మాలాగే మీరు కూడా ఒకరికొకరు ఆత్మీయాభిమానాలతో మెలగాలి. పరస్పరం ఆనందాన్ని పంచుకోవాలి’’ అని తెలిపారు.