ఒక్కొక్కర్నీ హఠాత్తుగా ‘అన్‌ఫాలో’ చేస్తున్న రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2021-06-03T22:02:24+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో ఉన్న పాత్రికేయులను, నేతలను అన్‌ఫాలో చేస్తూ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో ఉన్న పాత్రికేయులను, నేతలను అన్‌ఫాలో చేస్తూ వస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అటు విపక్ష నేతలు, సొంత పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించుకుంటున్నారు కూడా. అయితే అసలు విషయం ఏమిటంటే... రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్‌ను ‘రిఫ్రెష్’ చేస్తున్నారట. అందుకే కొన్ని అకౌంట్లను అన్‌ఫాలో చేస్తున్నారు. రిఫ్రెష్ ప్రక్రియ పూర్తైన తర్వాత యథావిథిగా ఫాలో ప్రక్రియ పునః ప్రారంభం అవుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ అన్‌ఫాలో జాబితాలో ఆయన సన్నిహితులు, ఆయన కార్యాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే కొందర్ని మాత్రం తన ట్విట్టర్‌లో కొనసాగించడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే కన్నుమూసిన మాజీ సీఎం తరుణ్ గొగోయ్, అహ్మద్ పటేల్, రాజీవ్ సతవ్ తదితరుల ట్విట్టర్ అకౌంట్లను రాహుల్ ఇంకా అన్‌ఫాలో చేయలేదు.