రాముడి పేరుతో మోసం చేయడం అధర్మం: రాహుల్

ABN , First Publish Date - 2021-06-15T01:15:20+05:30 IST

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై..

రాముడి పేరుతో మోసం చేయడం అధర్మం: రాహుల్

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. రాముడి పేరుతో మోసగించడం నేరమంటూ హిందీలో సోమవారంనాడు ట్వీట్ చేశారు. రాముడంటేనే సత్యానికి, న్యాయానికి మారుపేరని, ఆయన పేరు చెప్పి మోసగించడం అధర్మమని అన్నారు. ''రామ మందిర్ స్కామ్'' అంటూ తన ట్వీట్‌కు యాష్‌ట్యాగ్ ఇచ్చారు. భూముల కొనుగోలులో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసింది. రూ.2 కోట్లకు తీసుకోవాల్సిన భూమిని రామాలయం ట్రస్టు ఉద్దేశపూర్వకంగా 18.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని ఆప్ నేత సంజయ్ సింగ్, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని సమాజ్‌వాది పార్టీ నేత తేజ్ నారాయణ పాండే ఆదివారంనాడు వేర్వేరు ప్రెస్‌మీట్లలో ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారంపై దుమారం రేగింది.

Updated Date - 2021-06-15T01:15:20+05:30 IST