Abn logo
Jul 13 2020 @ 11:11AM

రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న నేతలు

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని చాలా మంది నేతలు ముక్త కంఠంతో కోరుతున్నారు. అయితే రాహుల్ మనసులో ఏముంది? కాంగ్రెస్ పగ్గాలను మళ్లీ చేపట్టడానికి రాహుల్‌కు ఉన్న అడ్డంకులు ఏంటి?.. ఓవైపు కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. మోదీ, అమిత్ షాల బలం పెరుగుతోంది. తాజా సంక్షోభ సమయంలోనూ కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు. మోదీ వైఫల్యాలపై గళం విప్పగల నేతలు మీరేనని చెబుతున్నారు. అయితే రాహుల్ నుంచి మాత్రం మౌనమే సమాధానంగా వస్తోంది.

Advertisement
Advertisement
Advertisement