Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుఫాన్‌ హెచ్చరికలతో రైల్వే డివిజన్‌ అధికారులు అప్రమత్తం

సహాయక చర్యలకు కంట్రోల్‌ రూం, హెల్ఫ్‌డెస్క్‌లు ఏర్పాటు

విశాఖపట్నం, డిసెంబరు 3: జవాన్‌ తుఫాన్‌ ప్రభావ హెచ్చరికల నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ అధికారులతో సమావేశమై ముందస్తు చర్యలపై చర్చించారు. విపత్తు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర యాక్షన్‌ ఫోర్సు, అగ్నిమాపక శాఖ, జిల్లా యంత్రాంగంతో సమన్వయమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


అత్యవసర కంట్రోల్‌ రూమ్‌తోపాటు డివిజన్‌ పరిధిలోని విశాఖ, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, నౌపడ, రాయగడ వంటి ప్రధాన స్షేన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందకు పైగా రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు ప్రత్యేక భద్రతా విభాగంతో కట్టుదిట్టమైన జాగ్రత్తలు చేపట్టారు.


అలాగే మెడికల్‌ రిలీఫ్‌ వ్యాన్‌లు, యాక్సిడెంట్‌ రిలీఫ్‌ రైళ్లు, టవర్‌ వ్యాగన్స్‌ వంటి వాటిని సిద్ధం చేశారు. ప్రభావిత ప్రాంతాలలో తక్షణమే సేవలందించేందుకు సహాయ సామగ్రిని సిద్ధం చేయడంతోపాటు తాగునీరు, ప్యాక్‌ చేసిన ఆహార పదార్ధాలను నిల్వ చేశారు. రాష్ట్ర వాతావరణ శాఖను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. 

Advertisement
Advertisement