ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం.. స్టేషన్ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు!

ABN , First Publish Date - 2021-03-08T02:27:32+05:30 IST

విధి నిర్వహణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రదర్శించిన నిర్వాకానికి ఓ స్టేషన్ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం.. స్టేషన్ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు!

న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రదర్శించిన నిర్వాకానికి ఓ స్టేషన్ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మధ్యప్రదేశ్‌లోని మాండ్సోర్ జిల్లాలోని గారోత్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఓ పారిశుధ్య కార్మికుడు స్టేషన్‌లోని టాయి‌లెట్‌కు అమర్చిన పైప్‌లైన్‌ను మంచినీళ్ల ట్యాంకుకు అనుసంధానం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మార్చి 5న వెస్ట్ సెంట్రల్ రైల్వే స్పందించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇందుకు బాధ్యుడైన కార్మికుడు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా.. రైల్వే అధికారులు సదరు స్టేషన్ మాస్టర్‌పై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. 

Updated Date - 2021-03-08T02:27:32+05:30 IST