Abn logo
Aug 23 2021 @ 08:06AM

IMD warning: నేడు ఉరుములు,మెరుపులతో మోస్తరు వర్షాలు

న్యూఢిల్లీ : సోమవారం మరో రెండు గంటల్లో ఢిల్లీ,ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం వెల్లడించింది.‘‘ఢిల్లీ, బరౌత్, దౌరాలా, చప్రౌలా, బాగ్‌పత్, ఖెక్రా, అనుప్‌షహర్, షికార్‌పూర్, పహాసు, దేబాయి, నరోరా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు చెప్పారు.

మీరట్, మోదీనగర్, పిలాఖువా, హపూర్, గులాటి, సియానా, సికంద్రాబాద్, బులంద్‌షహర్, ఖుర్జా, జహంగీరాబాద్ లలో వచ్చే గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య ఢిల్లీ, తూర్పు-ఢిల్లీ, ఖెక్రా, బాగ్‌పాత్ లోనీ-దేహాట్ పరిసర ప్రాంతాలలో రాబోయే 2 గంటలలో తేలికపాటి తీవ్రతతో కూడిన ఉరుములు, మెరుపులతో గాలివాన సంభవించవచ్చని సోమవారం ఉదయం ఐఎండీ ట్వీట్ చేసింది.శనివారం ఐఎండీ ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.


జాతీయంమరిన్ని...