వెన్ను విరిగే

ABN , First Publish Date - 2020-11-29T06:17:43+05:30 IST

నివర్‌.. జిల్లాలో ఊహించని నష్టం కలిగించింది. వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసింది. రైతన్నల వెన్నువిరిచింది.

వెన్ను విరిగే
పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద నీటిలో ఉన్న మిర్చి పంటను చూసి కన్నీరు పెడుతున్న రైతు

పెను ప్రభావం చూపిన నివర్‌

మూడు రోజుల్లో 146.70 మి.మీ సగటు వర్షం

సగం మండలాల్లో రెట్టింపు నమోదు

ఇంకా నీటిలోనే లక్షన్నర హెక్టార్లలో పంటలు 

ఉధృతంగానే వాగులు, వంకలు  

దెబ్బతిన్న రోడ్లు

అధికారులతో మంత్రులు బాలినేని, సురేష్‌ సమీక్ష

ఒంగోలు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : నివర్‌.. జిల్లాలో ఊహించని నష్టం కలిగించింది. వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసింది.  రైతన్నల వెన్నువిరిచింది. కీలకదశలో ఉన్న అనేక పంటలను దెబ్బతీసింది. జిల్లాలో 1.06 లక్షల హెక్టార్లపై తుఫాన్‌ ప్రభావం ఉన్నట్లు అధికారులు అంచనా వేయగా, వాస్తవంగా లక్షన్నర హెక్టార్లలో ఉన్నట్లు  రైతుల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సగటున హెక్టారుకు రూ.40వేల వంతున చూసినా రూ.600కోట్ల మేర రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో నవంబర్‌ 20నాటికి 2.50లక్షల హెక్టార్లలో పంటలు పొలంలోనే ఉన్నాయి. అందులో పత్తి, మినుము చేతికొచ్చే సమయం కాగా కంది కాపు, వరి కొన్నిచోట్ల కోతల దశలో ఉంది. ఇక పొగాకు, శనగ, మిర్చి పంటలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో ఊహించని రీతిలో కురిసిన భారీ వర్షాలు మొత్తం పంటలను ముంచెత్తాయి. ఆర్‌అండ్‌బీ, పశుసంవర్థక, విద్యుత్‌శాఖలతోపాటు గృహాలకూ భారీ నష్టం వాటిల్లింది. కాగా ఉప్పుటేరులో కొట్టుకుపోయిన వృద్ధుడు మృతి చెందగా, శుక్రవారం రాత్రి ఆటో కొట్టుకుపోయిన ఘటనలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంతవరకూ దొరకలేదు. 


మూడు రోజుల్లోనే నెల సాధారణం కన్నా అధిక వర్షం 

 జిల్లాలో నవంబరు నెల సాధారణవర్షపాతం 143.7 మి.మీ కాగా ఇప్పటివరకు 239.6 మి.మీ కురిసింది. అందులో నివర్‌ తుఫాన్‌ కారణంగా బుధవారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల్లోనే 146.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే నవంబరు నెల మొత్తం కన్నా ఈ మూడు రోజుల్లో ఇంకా అధికంగా కురిసింది. అందులోనూ దాదాపు మూడొంతుల మండలాల్లో 150 నుంచి 500 మి.మీ మేర నమోదైంది. ఈనెల 20నాటికే పలుమార్లు కురిసిన వర్షా లు పంట భూములన్నీ నెమ్ముతో ఉండగా, నివర్‌ తుఫాన్‌తో భారీవర్షం కురవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కందుకూరు, కొండపి, ఒం గోలు, ఎస్‌ఎన్‌.పాడు, కనిగిరి, అద్దంకి, పర్చూరు, చీరాల సెగ్మెంట్లలోని పలు ప్రాంతాల్లో నష్టం భారీగా ఉండగా, ఇతర ప్రాంతాల్లో కూడా కొంత మేర దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షన్నర హెక్టార్లలో పంట లు ఈ వర్షాలకు దెబ్బతిన్నట్లు తెలుస్తుండగా, లక్ష హెక్టార్లలో పంటలు ఇంకా నీటిలోనే ఉ న్నాయి. జిల్లావ్యాప్తంగా శనివారం ఎటుచూసినా రైతులు పొలంలో నీరు బ యటకు పంపి, పంటలను ఎంతో కొంత కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాగు లు, వంకలు పొంగి పొర్లుతుండ టంతో పొలాల్లోని నీరు బయటకు వెళ్లడం లేదు. మరో వారం రోజులపా టు చాలాప్రాంతాల్లో నీటిలోనే పంటలు ఉండక తప్పని పరిస్థితి కనిపిస్తుండగా దానివల్ల సర్వం నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


చెరువులను తలపిస్తున్న పొలాలు

కొన్నిచోట్ల వరిమడులు చెరువులను తలపిస్తూ నీటిలో మునిగి ఉండగా మిర్చి, పొగాకు, పత్తిపంటలు ఇప్పటికే ఉరకెత్తుతున్నాయి. మినుము పూర్తిగా ధ్వంసం కాగా, వరి ఓదెలు నీళ్లలో తేలుతున్నాయి. కాగా చాలా ప్రాంతాల్లో కొన్ని పంటలను మళ్లీ వేయక తప్పదని రైతులు చెప్తున్నారు. మొత్తంగా హెక్టారుకు రూ.40వేల వంతున చూసినా దాదాపు రూ.600కోట్ల మేర రైతులు నివర్‌ తుఫాన్‌తో నష్టపోయారు. మరోవైపు చేనేతలు, మత్స్య కారులు పనులు సాగక ఇబ్బందులు పడుతుండగా పట్టణాల్లో చిరు వ్యాపారులు, గ్రామాల్లో వ్యవసాయ కూలీలపైనా ప్రభావం కనిపిస్తోంది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు భారీగానే దెబ్బతిన్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఆ రెండు శాఖలకు చెందిన 250కి.మీ మేర రోడ్లు దెబ్బతిని దాదాపు రూ.755కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం. 


బాధితులను పలకరించిన  మంత్రులు బాలినేని, సురేష్‌

ఒంగోలులోని శ్రీనివాస థియే టర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన నివర్‌ బాధితుల పునరావాస శిబిరాన్ని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సురేష్‌ శని వారం సందర్శించారు. బాధి తులకు రూ.500చొప్పున సహాయాన్ని అందజేశారు. మళ్లీ బంగాళాఖాతంలో రా నున్న వారం రోజుల్లో మరో రెండు వాయుగుండాలు  ఏర్ప డే అవకాశం ఉందన్న సమాచా రంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలపై యంత్రాంగం అప్రమత్తం గా పనిచేస్తోంది. పంట నష్టాలల పరిశీలనల తోపాటు తక్షణం పంటలు రక్షించుకోవడంపై అధికా రులు రైతులకు సూచనలు ఇస్తున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో పర్య టించారు. వర్షాలకు దెబ్బతిన్న పలు పంటలను పరిశీలించారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 35వేల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 










Updated Date - 2020-11-29T06:17:43+05:30 IST