Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండు రోజులు భారీవర్ష సూచన

ఊపందుకున్న వరికోతలు

ఆందోళనలో రైతులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాతీరం వె ంబడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. దీంతో రైతుల్లో మళ్లీ అలజడి ఆరంభమైంది. ప్రస్తుతం వరి కోతలు ఊపందుకున్నాయి. భారీవర్షం కురుస్తుందనే హెచ్చరికలతో రైతులు పంటలను కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకాశం వెేుఘావృతమై కనిపించింది. జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లలో వరి, 37వేల హెక్టార్లలో పత్తి సాగు జరిగింది. నాలుగు రోజులుగా వాతావరణం అనుకూలంగా ఉండటంతో వరి కోతలను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో యంత్రాల ద్వారా వరి కోతలు పూర్తిచేసి ధాన్యం ఆరబెట్టారు. వర్షాలు కురిస్తే ఆరబెట్టిన ధాన్యం తడిచిపోతుందనే భయం రైతులను వెంటాడుతోంది. ఇదిలావుంటే, ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగు సలహాలు, సూచనలు ఇస్తున్నామని వ్యవసాయశాఖ జేడీ టి.మోహనరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Advertisement
Advertisement