వర్షం..నష్టం

ABN , First Publish Date - 2022-07-15T07:06:59+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల అపార నష్టం జరిగింది.

వర్షం..నష్టం
మెట్‌పల్లి మండలం పాటిమీది తండా శివారులో తెగిన రహదారి

- నీట మునిగిన పంట పొలాలు

- నేల కూలిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు

- ధ్వంసమైన రహదారులు

జగిత్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల అపార నష్టం జరిగింది. పంట పొలాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేల కూలాయి. బీటీ రహదారులు, సీసీ రహదారులు, మట్టి రహదారులు ద్వంసం అయ్యాయి. పలు ఇళ్లు పాక్షికంగా, మరికొన్ని సంపూర్ణంగా కూలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లోకి వరద నీరు చేరి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. మరికొన్నింటికి అధికారులు, గ్రామస్థులే గండి కొట్టి నీటిని మల్లించారు. కథలా పూర్‌ మండలంలోని రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువకు గండి పడింది. జిల్లాలో గోదావరి నది భీకరంగా తయారయింది. ధర్మపు రి, వెల్గటూరు మండలం కోటిలింగాల వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి పారుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల జనం అతలాకుతలం అవుతున్నారు. సామాన్య జీవనాన్ని గడప లేకపోతున్నారు. ఇళ్లలోనే  తలదాచుకుంటున్నారు.

- ఇళ్లు.. భవనాలు నేలమట్టం..

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా, సంపూర్ణంగా నేల మట్టమయ్యాయి. జిల్లాలో 310 ఇళ్లు పాక్షికంగా, తొమ్మిది ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. ఇందులో జగిత్యాల అర్బన్‌లో 14, జగిత్యాల రూరల్‌లో ఏడు, రాయికల్‌లో 20, ధర్మపురిలో 30, బుగ్గారంలో రెండు, సారం గపూర్‌లో 14, బీర్‌పూర్‌లో 16, మల్యాలలో 10, గొల్లపల్లిలో 17, పెగడపల్లిలో ఏడు, కొడిమ్యాల ఐదు, వెల్గటూరు 14, మేడిపల్లి 10, కోరుట్ల 19, కథలాపూర్‌లో ఆరు, మెట్‌పల్లి ఎనిమిది, ఇబ్ర హీంపట్నం 24, మల్లాపూర్‌లో ఎనిమిది ఇళ్లు పాక్షికంగా కూలా యి. అదేవిధంగా జగిత్యాల రూరల్‌, రాయికల్‌, బీర్‌పూర్‌లో ఒక్కో ఇళ్లు, ధర్మపురిలో రెండు, మెట్‌పల్లిలో ఏడు ఇళ్లు సంపూర్ణంగా నేలమట్టమయ్యాయి. అదేవిధంగా వెల్గటూరు మండలంలోని రాజక్కపల్లిలో గ్రామ పంచాయతీ భవనం కూలిపోయింది. పెగడపల్లిలో తొమ్మిది గొర్రెలు మృతి చెందాయి. 

- విద్యుత్‌ సరఫరాలో అంతరాయం...

జిల్లాలో 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు 75, ఎల్‌టీ విద్యుత్‌ స్తంభాలు 152, 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు 10 విరిగిపోయాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 15 ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోయాయి. ధర్మపురి మండలంలోని కమలాపూర్‌, నాగారంలలో విద్యుత్‌ సరాఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సబ్‌ డివిజ న్లు, మండలాల వారీగా విద్యుత్‌ సంస్థకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. 

- 22,992 ఎకరాల్లో పంట..

జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల 12,588 మంది రైతులు 22,992 ఎకరాల వివిధ పంటలు నష్టపోయారు. ప్రధానంగా పత్తి 10,010 ఎకరాలు, సోయాబిన్‌ 1,483 ఎకరాలు, మొక్కజొన్న 9,038 ఎకరాలు, పసుపు 1,921 ఎకరాలు, కంది 540 ఎకరాల్లో నష్టానికి గురయింది.  బుగ్గారంలో 1,107 ఎకరాల్లో పంట నష్టం జరగగా పత్తి 616 ఎకరాల్లో, మొక్కజొన్న 193 ఎకరాలు, కంది 70 ఎకరాలు, పసుపు 228 ఎకరాలు నష్టానికి గురయింది. ధర్మపురిలో పత్తి 1,900, మొక్కజొన్న 235 ఎకరాలు, పసుపు 134 ఎకరాలు, గొల్లపల్లిలో పత్తి 2,100, మొక్కజొన్న 158 ఎకరాలు, పసుపు 49 ఎకరాలు, పెగడపల్లిలో పత్తి 194 ఎకరాలు, మొక్క జొన్న 104 ఎకరాలు, కంది ఆరు ఎకరాలు, పసుపు 56 ఎకరాలు నష్టానికి గురయింది. వెల్గటూరులో పత్తి 2,760 ఎకరాలు, మొక్కజొన్న ఆరు ఎకరాలు, పసుపు 30 ఎకరాలు, బీర్‌పూర్‌లో పత్తి 500 ఎకరాలు, మొక్కజొన్న 120 ఎకరాలు, కొడిమ్యాల మం డలంలో పత్తి 1,200 ఎకరాలు, మొక్కజొన్న 50 ఎకరాలు, జగిత్యాలలో పత్తి 91 ఎకరాలు, సోయాబిన్‌ 2.3 ఎకరాలు, మొక్క జొన్న 731 ఎకరాలు, కంది 105, పసుపు 330 ఎకరాల్లో నష్ట పోయారు. మల్యాలలో పత్తి 82 ఎకరాలు, మొక్క జొన్న రెండు ఎకరాలు, కంది 22 ఎకరాలు, పసుపు ఒక  ఎకరం, మేడిపల్లిలో పత్తి ఎనిమిది ఎకరాలు, రాయికల్‌లో పత్తి 435 ఎకరాలు, సోయాబిన్‌ ఒక ఎకరం, మొక్కజొన్న 259 ఎకరాలు, కంది 42 ఎకరాలు, పసుపు 168 ఎకరాలు, సారంపూర్‌లో పత్తి 104 ఎకరాల్లో నష్టానికి గురయింది. ఇబ్రహీంపట్నంలో సోయా బిన్‌ 960 ఎకరాలు, మొక్కజొన్న 2,450 ఎకరాలు, కథలాపూర్‌లో పత్తి 20 ఎకరాలు, మొక్కజొన్న 85 ఎకరాలు, కోరుట్లలో సోయాబిన్‌ 40 ఎకరాలు, మొక్కజొన్న 950 ఎకరాలు, పసుపు 12 ఎకరాలు, మల్లాపూర్‌లో సోయాబిన్‌ 170 ఎకరాలు, మొక్కజొన్న 1,980 ఎకరాలు, పసుపు 236 ఎకరాలు, మెట్‌పల్లిలో సోయాబిన్‌ 310 ఎకరాలు, మొక్కజొన్న 1,300 ఎకరాలు, కంది 18 ఎకరాలు, పసుపు 677 ఎకరాల్లో నష్టానికి గురయింది.

- చెరువులు, కుంటల్లో సామర్థ్యానికి మించి నీరు...

జిల్లాలోని పలు చెరువులు, కుంటల్లో సామర్థ్యానికి మించి నీరు చేరింది. దీంతో పలు చెరువులు ప్రమాదకర స్థాయిని ఎదు ర్కొంటున్నాయి. జిల్లాలో 849 చెరువులు, కుంటల్లో సామర్థ్యానికి మించి నీరు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో జగి త్యాల అర్బన్‌లో 11, జగిత్యాల రూరల్‌లో 46, రాయికల్‌లో 98, ధర్మపురిలో 99, బుగ్గారంలో 28, సారంగ పూర్‌లో 54, బీర్‌పూర్‌ లో 33, మల్యాలలో 19, గొల్లపల్లిలో 48, పెగడపల్లిలో 47, కొడి మ్యాలలో 28, వెల్గటూరులో 60, మేడిపల్లి లో 27, కోరుట్లలో 36, మెట్‌పల్లిలో 44, ఇబ్రహీంపట్నంలో 11, మల్లాపూర్‌లో 72 చెరువు లు, కుంటల్లోకి సామర్థ్యానికి మిం చి నీరు చేరి నట్లు అధికారులు గుర్తించారు.

ఫ  4,115 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

జిల్లాలోని 21 గ్రామాల్లో వరద నీటి ముంపునకు గురయిన ప్రాంతాలకు చెందిన 4,115 మందిని సురక్షిత ప్రాం తాలకు తరలించారు. జిల్లాలోని రాయికల్‌ మండలం రామోజీ పేట శివారులో గల వాగులో ఒకరు గల్లంతయ్యారు. జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గోవిందుపల్లి, వెంకటాద్రినగర్‌, గోత్రాల కాలనీ, కండ్లపల్లి కాలనీకి చెందిన 50 మందిని, రాయికల్‌ మండలంలోని ఆరు గ్రామాల్లో 70 మందిని, బీర్‌పూర్‌ మండ లంలోని ఆరు గ్రామాల్లో 1,410 మందిని, ధర్మపురిలోని ఎనిమిది ప్రాంతాలు, గ్రామాల నుంచి 1,993 మందిని, వెల్గటూరు మం డలంలోని మూడు గ్రామాల నుంచి 153 మందిని, కోరుట్ల పట్ట ణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 280 మందిని, మెట్‌పల్లి లోని కళానగర్‌ నుంచి ఎనిమిది మందిని, ఇబ్రహీంపట్నం మం డలం ఎర్ధండి, కోమటి కొండాపూర్‌ నుంచి 48 మందిని, మల్లాపూ ర్‌ మండలంలోని మూడు గ్రామాల నుంచి 103 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏడు పునరావవాస కేంద్రాలు ఏర్పాటు చేసి 975 మందికి ఆశ్రయం కల్పించారు.

Updated Date - 2022-07-15T07:06:59+05:30 IST