వర్షార్పణం

ABN , First Publish Date - 2021-04-14T06:07:46+05:30 IST

జిల్లాలో ఆకాలంగా కురిసిన వర్షంతో రై తులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం సాయం త్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది.

వర్షార్పణం
జక్రాన్‌పల్లిలో తడిసిన ధాన్యం

జిల్లాలో అకాల వర్షం

తడిసి ముద్దయిన ధాన్యం

నేలవాలిన వరి పైరు

తీవ్రంగా నష్టపోయిన రైతులు

నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ న్యూస్‌ నెట్‌వర్క్‌, ఏప్రిల్‌ 13 : జిల్లాలో ఆకాలంగా కురిసిన వర్షంతో రై తులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం సాయం త్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. వర్ని, ఎడపల్లి, నవీపేట, కోటగిరి, నిజామాబాద్‌ రూరల్‌ మాక్ల్లూర్‌, జక్రాన్‌పల్లి, బాల్కొండ, ఆర్మూర్‌ మండలాల పరిధిలో ఈవర్షం వల్ల పలు గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని రోజులుగా వరి కోతలు చేస్తున్న రైతులు పొలాల వద్ద, రోడ్లపైన ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను తెరవగానే విక్రచించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో మంగళవారం సాయం త్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైం ది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్లు పడ డంతో ధాన్యం నేలరాలింది. రోడ్లపైన పోసిన ధాన్యం వర్షా నికి కొట్టుకపోతుండడంతో రైతులు ఆపేందుకు తిప్పలు పడ్డారు. పలు గ్రామాల పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యా న్ని తరలించకపోవడంతో ఆ బస్తాలు కూడా తడిసి పోయాయి. పలు కొనుగోలు కేంద్రాలకు టార్పాలీన్లు సర ఫరా చేయకపోవడంతో ఆకాల వర్షానికి ధాన్యం తడిసి పోయింది. జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన కొనుగోలును వేగంగా చేయకపోవడం వలన ఈ వర్షాలకు ధాన్యం దెబ్బ తిం టుందని పలవురు రైతులు వాపోయారు. అధికారులు చొరవ చూపి కొను గోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఈ వర్షానికి పలు గ్రామాల పరిధిలోని మామిడి కూడా నెలరాలింది. ఈదు రు గాలులు ఎక్కువ రావడంతో పలుచోట్ల చెట్లు నెల కొరిగాయి. కొన్ని చోట్ల కరెంట్‌ తీగలు కూడా దె బ్బతిన్నా యి. ఆకాల వర్షం మళ్లీ వచ్చేఅవకాశం ఉం డడంతో ధాన్యాన్ని కాపాడేందుకు రైతులు ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఈ ఆకాల వర్షానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేప్రయత్నం చేస్తు న్నారు. కోటగిరి మండలం యాద్గార్‌పూర్‌ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈత చెట్టుపై పడుగు పడింది. దీంతో ఈత చెట్టుకు మండలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

నగరంలో భారీ వర్షం

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. అల్పపీడన ధ్రోణి ప్రభావంతో అకాల వర్షాల జిల్లాలో అక్కడకక్కడ చెదురుముదురు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడగా నగరంలోని ఒక మోస్తారు వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి మేఘావృతమైన ఆకాశంతో వాతావరణం చల్లగా మారింది. సాయంత్రంపూట అరగంటపాటు ఉరుములతో కూడిన వర్షం పడడంతో కొంత ఉక్కపోత తగ్గినప్పటికి రాత్రి వేళల్లో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా కాలం తర్వాత వర్షం పడడంతో నగర వాహనదారులు వర్షంలో తడుస్తూ ఎంజాయ్‌ చేశారు. 

Updated Date - 2021-04-14T06:07:46+05:30 IST