Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇటుక తయారీకి వర్షాలు అడ్డంకి

పెరిగిన వ్యయంతో బట్టీల యజమానుల విలవిల 

రాయి ధరలకు రెక్కలు


అద్దంకి, నవంబరు 30: ఇటుక తయారీ పనులు ము మ్మరంగా సాగుతూ బట్టీలలో పెద్ద మొత్తంలో నిల్వలు ఉండాల్సిన సమయంలో వర్షాల ప్రభావంతో పనులు ముందుకు సాగక నిల్వలు లేకుండా పోయాయి. దీంతో ఉ న్న కొద్దిపాటి ఇటుకకు డిమాండ్‌ ఏర్పడింది. అద్దంకి ప్రాం తంలో సుమారు 70 వరకు ఇటుక బట్టీలు ఉన్నాయి. ఏడాదికి సరాసరిన రూ.20కోట్ల ఇటుకలు తయారీ చేస్తుంటా రు. అద్దంకి ప్రాంతంలో తయారయ్యే ఇటుకను గుంటూ రు, ప్రకాశం జిల్లాలలో భవనాల నిర్మాణానికి వినియోగిస్తుంటారు. సాధారణంగా ఇటుక తయారీకి రూ.5-50 నుంచి రూ.6 వరకు ఖర్చు అవుతుంది. కానీ గత  రెండు, మూడు సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణాలు పెద్దగా లేకపోవటంతో 1000 ఇటుకల ధర రూ.5,500లుగానే ఉంది. దీంతో ఇటుక బట్టీల యజమానులు నష్టానికే అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరు నెల చివర, నవంబరు నెల ప్రారంభం నుంచి ఇటుక తయారీ ప్రారంభించి కొత్త బట్టీలు వేస్తుంటారు. అయితే నెల రోజులు గా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ఇటుక తయారీ ప్రా రంభం కాలేదు. ఇటుక తయారీకి స్థానిక కూలీలతో పాటు కాకినాడ, ఒడిసా  ప్రాంతాల నుంచి వస్తుంటారు. అక్టోబ రు నెలలోనే కూలీలు బట్టీల వద్దకు చేరుకున్నారు. వర్షాల తో పనులు లేకపోవటంతో ఖాళీగానే ఉన్నారు. కూలీలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకు వస్తుండటంతో ఖాళీగా ఉన్నా కూలి చెల్లించాల్సి రావటం, తిండి ఖర్చులకు ఇవ్వాల్సి రావటంతో బట్టీల యజమానులకు మరింత భారంగా మారిం ది. అసలే మూలిగే నక్కపై తాటి కాయపడ్డట్లు గా బట్టీల యజమానుల పరిస్థితి మారింది. అదే సమయంలో ఇటు క లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు వెళ్లే స్థానిక కూలీలకు కూడా ప నులు లేకుండా పోయాయి. 


పెరిగిన డిమాండ్‌


కొత్త ఇటుక తయారీ ప్రారంభం కాకపోవటంతో కొన్ని బట్టీలలో కొద్ది మేర మిగిలి ఉన్న ఇటుకకు డిమాండ్‌ వ చ్చింది. దీంతో వెయ్యి ఇటుకల ధర రూ.7,500కు పెరిగింది. ఇటుక నిల్వలు ఉన్న బట్టీల యజమానులకు కొంత మేర ఆదాయం చేకూరింది. అయితే ఒక్కసారిగా ధరలు పెరగటంతో ఇళ్ల నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. వ ర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇటుక తయారీకి సిద్ధం చేస్తున్నారు. మళ్లీ వర్షాలు పడితే ఇటుక తయారీ ఆలస్యం అయితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. పనులు సాగక పోతే కూలీల ఖర్చులు మరింత భారంగా మారతాయని బట్టీల యజమానులు వాపోతున్నారు.


Advertisement
Advertisement