రాజ్యాంగ హక్కులపై అవగాహన పెంపొందించాలి

ABN , First Publish Date - 2021-11-27T06:11:32+05:30 IST

రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. 72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు.

రాజ్యాంగ హక్కులపై అవగాహన పెంపొందించాలి
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

 సిరిసిల్ల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. 72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. సమీ కృత కలెక్టరేట్‌లో అంబేద్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాం గాన్ని గౌరవిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగానికి అమోదం తెలిపారన్నారు.  రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. భారత రాజ్యాంగం ద్వారానే దేశానికి స్వాంతంత్య్ర ప్రతిపత్తి వచ్చిందన్నారు. రాజ్యాం గంతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన మహనీ యుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. కలెక్టరేట్‌ ఏవో గంగయ్య, వివిధ విభాగాల సూపరిం టెండెంట్‌లు శ్రీకాంత్‌, రామకృష్ణ, రవికాంత్‌, సుజాత, రమేష్‌ పాల్గొన్నారు. 

ఫ జిల్లా పరిషత్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జడ్పీటీసీ నాగం కుమార్‌, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యా లయంలో ఎస్పీ రాహుల్‌హెగ్డే అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం  పోలీస్‌ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహానీయుడు అంబేద్కర్‌ అన్నారు.  ఏవో అహ్మదుల్లా ఖాన్‌, సూపరిం టెండెంట్‌ సూర్యనారాయణ, జూనియర్‌ అసిస్టెంట్‌ దేవయ్య, ఎస్సై సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T06:11:32+05:30 IST