చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-10-18T06:37:41+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చౌటుప్పల్‌ సివిల్‌ కోర్టు జూనియర్‌ జడ్జి దుర్గారాణి సూచించారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
గుడి మల్కాపురంలో మాట్లాడుతున్న జడ్జి దుర్గారాణి

చౌటుప్పల్‌ సివిల్‌ కోర్టు జడ్జి దుర్గారాణి

సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌ రూరల్‌, అక్టోబరు 17: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చౌటుప్పల్‌ సివిల్‌ కోర్టు జూనియర్‌ జడ్జి దుర్గారాణి సూచించారు. పాన్‌ లీగల్‌ అవేర్నెస్‌ అవుట్‌ రీచ్‌, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సంస్థాన్‌నారాయణపురం మండలం గుడిమల్కాపురం, అల్లందేవి చెరువు, పల్లగట్టు తండా, చౌటుప్పల్‌ మండలంలో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు. చట్టాలు, మహిళలు, బాలల హక్కులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దుర్గారాణి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ న్యాయపరమైన సేవలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మన్నె పుష్పలత, యాదయ్య, విజయ్‌కిషన్‌, సీఐ వెంకటయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

చౌటుప్పల్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా నాగరాజు

చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా నాగరాజు ఈనెల 18న బాధ్యతలు స్వీకరించనున్నారు. మేడ్చల్‌ మ ల్కాజ్‌గిరికోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాగరాజు బదిలీపై చౌటుప్పల్‌కు రానున్నారు. ఇన్‌చార్జిగా రామన్నపేట కోర్టుజడ్జి దుర్గారాణి బాధ్యతలు నిర్వహించారు. 

Updated Date - 2021-10-18T06:37:41+05:30 IST