Abn logo
Oct 26 2021 @ 23:44PM

యూపీ ఘటనకు కారకులను శిక్షించాలి

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నాయకులు

రైతు సంఘాల నాయకుల నిరసన

గుంటూరు(తూర్పు), అక్టోబరు26: యూపీలో రైతుల మరణాలకు కారణమైన బీజేపీ నాయకులను కఠినంగా శిక్షంచాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యులైన కేంద్రమంత్రిని బర్తరఫ్‌ చేయాలంటూ మంగళవారం కలెక్టర్‌ కార్యలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నల్లమడ రైతుసంఘ నాయకుడు కొల్లా రాజమోహన మాట్లాడుతూ రైతులను చంపైనా సరే నల్లచట్టాలను అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ధర్నాలో రైతు సంఘాల నాయకులు పి.కోటేశ్వరరావు, కె.అజయ్‌, నాదెండ్ల బ్రహ్మయ్య, నరసింహారావు, శ్రీధర్‌, ఈమని ఆప్పారావు, అరుణ, చిష్టీ, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.