ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేయొద్దు: రాజస్థాన్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-07-08T22:40:23+05:30 IST

స్కూళ్లు పునఃప్రారంభం అయ్యే వరకూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయకూదని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది.

ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేయొద్దు: రాజస్థాన్ ప్రభుత్వం

జైపూర్: స్కూళ్లు పునఃప్రారంభం అయ్యే వరకూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయకూదని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఊరట కలిగినట్టైంది. ప్రైవేటు స్కూళ్లు ముందస్తు ఫీజులు వసూలు చేయరాదంటూ ఏప్రిల్ 9న ప్రభుత్వం ఆదేశించింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో..మళ్లీ స్కూళ్లు తెరుచుకునే వరకూ అప్పటి ఆదేశాలు అమల్లో ఉంటాయని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా దేశంలోని అన్ని పాఠశాలలూ మూసివేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-08T22:40:23+05:30 IST