Abn logo
May 19 2021 @ 02:26AM

కరోనా నివారణకు రాజీవ్‌ హత్యకేసు ముద్దాయి విరాళం

చెన్నై, మే 18 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్‌ హత్యకేసు ముద్దాయి నళిని కరోనా నివారణ కోసం తన వంతు సాయం చేశారు. ఇందు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆమె రూ.5వేలను విరాళంగా అందజేశారు. వేలూరు మహిళా జైలులో యావజీవ్జవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని జైలులో పని చేయడం ద్వారా వచ్చిన సంపాదన నుండి రూ.5వేలను అధికారుల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి పంపినట్లు ఆమె తరఫు న్యాయవాది పుహళేంది పేర్కొన్నారు. ఇప్పటికే మదురై సెంట్రల్‌ జైలులో ఉన్న రవిచంద్రన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 వేలు అందించిన విషయం తెలిసిందే.

Advertisement