ప్రభుత్వ పిడివాదం అంతకు దారి తీసింది: టికాయత్

ABN , First Publish Date - 2021-07-02T00:21:37+05:30 IST

వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిందేనని, అప్పటి వరకు రైతులెవరు ఇంటికి వెళ్లరని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని తప్పు పడుతూ ట్వీట్ చేశారు.

ప్రభుత్వ పిడివాదం అంతకు దారి తీసింది: టికాయత్

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం అవలంబిస్తోన్న విడివాద వైఖరి దేశంలో అత్యవసర పరిస్థితుల్ని సృష్టించిందని భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ అన్నారు. వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిందేనని, అప్పటి వరకు రైతులెవరు ఇంటికి వెళ్లరని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని తప్పు పడుతూ ట్వీట్ చేశారు.


‘‘మూడు వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వ పిడివాదం వల్లే దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనంత వరకు రైతులు ఇంటికి తిరిగి వెళ్లరు. దీనిపై ప్రభుత్వం అనవసర రాద్దాంతం చేస్తోంది. ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కనీస మద్దతు ధరపై చట్టం చేయాల్సిన అవసరం ఉంది’’ అని టికాయత్ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-07-02T00:21:37+05:30 IST