Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 23 2021 @ 08:56AM

కల్యాణ్ సింగ్ మరో జన్మనెత్తి సమాజ సేవ చేస్తారు: రామ్ విలాస్ దాస్!

లక్నో: రామాలయ ఆందోళనల్లో భాగస్వామ్యం వహించిన రామ్ విలాస్ దాస్ వేదాంతి బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ్ సింగ్ లాంటి మహా పురుషుడు పునర్జన్మ తీసుకుని భారతమాత గౌరవానికి రక్షణ వహిస్తారని అన్నారు. కల్యాణ్ సింగ్ కుటుంబంలో ఆయన లాంటి మహనీయుడు జన్మించాలని, అతను సమాజ సేవ చేయాలని శ్రీరాముణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. రామ్ విలాస్ దాస్ వేదాంతి.. కల్యాణ్ సింగ్‌లు ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. రామ్ విలాస్ దాస్ కూడా రామజన్మభూమి ఆందోళనల అనంతరం బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఎంపీగా గెలిచారు.


Advertisement
Advertisement