Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంత నిర్బంధం అవసరమా?: రామకృష్ణ

విజయవాడ: అమరావతి ప్రాంతంలో ఇంత నిర్బంధం అవసరమా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతులు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమయితే మూడు చెక్ పోస్టులు, 3 వేల మంది పోలీసులతో పహార ఎందుకని నిలదీశారు. అమరావతిలో మహిళలపై దాష్టీకాన్ని ఖండిస్తున్నామని, మీడియాపై ఆంక్షలను నిరశిస్తున్నామన్నారు. ఇప్పటికైనా మూడు రాజధానులు పేరుతో మూర్ఖంగా ముందుకు పోకుండా, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.


Advertisement
Advertisement