రామేశ్వరం ఆలయానికి కొత్త స్ఫటిక లింగం

ABN , First Publish Date - 2021-02-26T13:23:45+05:30 IST

రామేశ్వరం ఆలయంలో కొత్త స్ఫటిక లింగం భక్తులకు దర్శనమిచ్చింది. ఇక్కడ ఇదివరలో ఉన్న స్ఫటిక లింగం ఈనెల 22వ తేదీ తెల్లవారుజామున ఊహించని విధంగా దెబ్బతిన్నట్టు ...

రామేశ్వరం ఆలయానికి కొత్త స్ఫటిక లింగం

చెన్నై/పెరంబూర్‌ (ఆంధ్రజ్యోతి): రామేశ్వరం ఆలయంలో కొత్త స్ఫటిక లింగం భక్తులకు దర్శనమిచ్చింది. ఇక్కడ ఇదివరలో ఉన్న స్ఫటిక లింగం ఈనెల 22వ తేదీ తెల్లవారుజామున ఊహించని విధంగా దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, శృంగేరి మఠం కొత్త స్ఫటిక లింగాన్ని ఆలయానికి అందజేసింది. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు.  ఆలయ ప్రవేశద్వారం  తెరచిన వెంటనే తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల వరకు ఒక గంట మాత్రం స్పటిక లింగం దర్శనమిస్తుండగా, మిగిలిన సమాయాల్లో ఈ లింగాన్ని దర్శించేందుకు వీలుకాదు. ఈ నేఫథ్యంలో, ఈ నెల 22వ తేదీ తెల్లవారుజామున ఊహించని విధంగా స్పటిక లింగం దెబ్బతింది. దీంతో, కర్ణాటక రాష్ట్రానికి చెందిన శృంగేరి మఠం తరఫున సుమారు రెండు కిలోల బరువున్న కొత్త స్ఫటిక లింగాన్ని ఆలయ యాజమాన్యానికి అందజేశారు. గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, దీపారాధన అనంతరం భక్తుల దర్శనానికి ఉంచారు. ఈ విషయమై ఆలయ జాయింట్‌ కమిషనర్‌ కల్యాణి మాట్లాడుతూ, రెండు రోజుల కిత్రం స్ఫటిక లింగం దెబ్బతినండంతో భక్తులు దర్శించుకోలేకపోయారని, శృంగేరి మఠం అందజేసిన కొత్త స్ఫటిక లింగంను గురువారం నుంచి భక్తుల దర్శనార్థం ఉంచుతున్నట్టు ఆమె తెలిపారు.

Updated Date - 2021-02-26T13:23:45+05:30 IST