అనుమతి తీసుకున్నా .. కూలదోస్తారా?

ABN , First Publish Date - 2020-08-10T12:27:13+05:30 IST

స్థానిక రాణిమల్లమ్మదేవి మునిసిపల్‌ పార్కు వెనుక భాగాన చెరువు గట్టుపై..

అనుమతి తీసుకున్నా .. కూలదోస్తారా?

బొబ్బిలి(విజయనగరం): స్థానిక రాణిమల్లమ్మదేవి మునిసిపల్‌ పార్కు వెనుక భాగాన చెరువు గట్టుపై  రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకుంటామని  అనుమతి తీసు కున్నప్పటికీ ఆ నిర్మాణాన్ని అడ్డుకోవడం అన్యాయమని పారిశుధ్య కార్మికులు వాపోయారు. షెడ్డు నిర్మాణాన్ని మునిసిపల్‌ అధికారులు ఆదివారం యంత్రాలతో తొలగించారు. ఎమ్మెల్యే, మునిసిపల్‌ కమిషనర్‌ అనుమతి తోనే పనులు ప్రారంభించినప్పటికీ , వాటిని తొలగించడం అన్యాయమని మునిసి పల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు పొట్నూరు శంకరరావు, బంగారి వెంకటేష్‌ తెలిపారు. ఈ దుర్మార్గపు చర్యను అందరూ ఖండించాలన్నారు.

Updated Date - 2020-08-10T12:27:13+05:30 IST