అధికార పార్టీ నాయకుల మాట అధికారులు వినాల్సిందే

ABN , First Publish Date - 2022-01-19T06:04:41+05:30 IST

అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల మాట అధికారులు వినాల్సిందేనని ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబు అల్టిమేటం జారీ చేశారు. నగరం మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో మండల స్థాయి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

అధికార పార్టీ నాయకుల మాట అధికారులు వినాల్సిందే
ఎలక్ర్టికల్‌ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు

 మామిడికుదురు, జనవరి 18: అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల మాట అధికారులు వినాల్సిందేనని ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబు అల్టిమేటం జారీ చేశారు. నగరం మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో మండల స్థాయి అధికారులతో మంగళవారం   సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి నాయకులను గౌరవించి వారు అడిగినవి కాదనకుండా చేయాలని ఎమ్మెల్యేలు అధికారులకు సూచించడంపై పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. అంతే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యేలు సమావేశం ద్వారా హెచ్చరించారు. ఈ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే ఒక అధికా రిపై పరుష పదజాలంతో మాట్లాడడంతో ఇదే అదునుగా కొందరు పార్టీ నాయకులు అధికారులపై విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.వనజాకుమారి, జడ్పీటీసీ కసిరెడ్డి అంజిబాబు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T06:04:41+05:30 IST