రేషన్‌ కట్‌

ABN , First Publish Date - 2021-03-03T05:14:39+05:30 IST

వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా 75 వేల పేద కుటుంబాలకు గత నెలలో రేషన్‌ సరుకుల కోత పడింది.

రేషన్‌ కట్‌

ఫిబ్రవరిలో 75 వేల కార్డు దారులకు కోత 

ఈ నెలలోనైనా సరుకుల పంపిణీ సజావుగా జరిగేనా

డోర్‌ డెలివరీ కాదు... రోడ్డు  డెలివరీ అంటోన్న ప్రతిపక్షాలు


గుంటూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా 75 వేల  పేద కుటుంబాలకు గత నెలలో రేషన్‌ సరుకుల కోత పడింది. మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ) విధానం అమలులో సాంకేతిక సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ కారణంగా ఆలస్యంగా ప్రా రంభించి రెండు వారాల్లోనే ముగించడం తదితర కారణా లతో ఈ పరిస్థితి ఉత్పన్న మైంది. కనీసం గ్రామీణ ప్రాంతాల వరకైనా ఫిబ్రవరి నెల రేషన్‌ సరుకుల పంపిణీ గడ వుని పొడిగించకుండా ముగించేసి సోమ వారం నుంచి మార్చి నెల సరుకుల పంపి ణీకి శ్రీకారం చుట్టడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ నెల ఎలాంటి ఆటం కాలు లేకపోయినా తొలి రోజున కేవలం 18 వేల కుటుంబాలకు మాత్రమే రేషన్‌ సరు కులు అందడంతో ఎండీయూ విధానం సా మర్థ్యంపై సందేహా లు వ్యక్తమౌతున్నాయి. జిల్లాలో 14 లక్షల 64 వేల 126 కుటుం బాలకు రైస్‌కార్డులున్నాయి. ప్రతీనెలా సగ టున 80 నుంచి 82 శాతం మధ్యన పం పి ణీ జరుగుతుంది. 11.65 లక్షల కుటుంబాలు ప్రతీ నెలా సరుకులు తీసుకొంటుంటాయి. అలాంటిది ఫిబ్రవరిలో 10.88 లక్షల కుటుం బాలకే ఎండీయూ విధానంలో రేషన్‌ సరుకు ల డోర్‌ డెలివరీ జరిగింది. దీనిని పరిగణన లోకి తీసుకొంటే దాదాపుగా 75 వేల కుటుం బాలకు రేషన్‌ సరుకుల పంపిణీలో కోత పడినట్లు స్పష్టమౌతున్నది. ఈ విషయాన్ని కప్పిపెట్టిన అధికారవర్గాలు పట్టణ ప్రాంతా ల్లో గతంలో కంటే 11 శాతం మందికి అద నంగా సరుకుల పంపిణీ జరిగినట్లు చెప్పా రు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరో మూ డు, నాలుగు రోజుల అవకాశం కల్పించి ఎం డీయూల ద్వారా సరుకుల పంపిణీ కొన సా గించి ఉంటే సాధారణ పంపిణీ శాతానికి చేరుకునేదని పలువురు అభిప్రాయ పడుతు న్నారు. అయితే ఇందుకు ప్రభుత్వం అంగీక రించకపోవడంతో మార్చినెల సరుకుల పం పిణీని సోమవారం నుంచి ప్రారంభిం చేశారు. దేశం, ప్రపంచంలోనే రేషన్‌ సరు కుల డోర్‌ డెలివరీ ఇక్కడే ప్రప్ర థమంగా జరుగుతోందని ప్రభుత్వం ఎంతో ఘనంగా చెబుతోన్నది. ఇదే విషయాన్ని పౌరసర ఫరాల శాఖ అధికారులతోనూ చెప్పిస్తోన్నది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది డోర్‌ డెలివరీ కాదు రోడ్డు డెలివరీ అని విమ ర్శలు గుప్పిస్తోన్నాయి. డోర్‌ డెలివరీ అంటే ఇంటి గడప వద్దకు తీసుకొచ్చి సరఫరా చేయడమని, ఎండీయూ విధానంలో అలా జరగడం లేదని చెబుతు న్నాయి. ఎక్కడో వీధి చివరన వాహనం నిలిపితే అక్కడికి ప్రజలు వెళ్లి క్యూలైన్‌లో నిలుచుని సరు కులు తెచ్చుకొంటున్నారని చెప్పారు. గతం లో పనులకు వెళ్లి సాయంత్రం వచ్చి సరు కులు తెచ్చు కునేవారని, ఇప్పుడు పని మా నుకుని వాహనం రాకకోసం ఎదురు చూడా ల్సి వస్తుందని కార్డుదారులు వాపోతున్నారు. 



Updated Date - 2021-03-03T05:14:39+05:30 IST