నేటి నుంచి రేషన్‌

ABN , First Publish Date - 2021-12-01T07:11:05+05:30 IST

జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ జరగనుంది.

నేటి నుంచి రేషన్‌

మొబైల్‌ వాహనాల ద్వారా పంపిణీ

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 30: జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ జరగనుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. జిల్లాలో 9.84లక్షల రేషన్‌ కార్డులు ఉండగా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.  కందిపప్పు, చక్కెరను నగదుపై ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటిని పౌరసరఫరాల గిడ్డంకుల నుంచి రేషన్‌షాపులకు తరలించారు. బుధవారం ఉదయం నుంచి వాహనాల ద్వారా ఇంటింటికీ ఇవ్వనున్నారు. ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయాలని ఒకచోట నిలబెట్టి  ఇస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్‌వో  సురేష్‌ హెచ్చరించారు. 

Updated Date - 2021-12-01T07:11:05+05:30 IST