1600 కిలోల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-07-23T07:20:46+05:30 IST

కోటనందూరులో రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. కోటనందూరులోని శ్రీమహాలక్ష్మి రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ డీఎస్‌పీ ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలించిన 1600 కిలోల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు.

1600 కిలోల రేషన్‌ బియ్యం పట్టివేత
కోటనందూరులో రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు దాడులు

కోటనందూరు, జూలై 22: కోటనందూరులో రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. కోటనందూరులోని శ్రీమహాలక్ష్మి రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ డీఎస్‌పీ ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలించిన 1600 కిలోల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. 181 టన్నులు ధాన్యం నిల్వలు తేడాగా ఉన్నాయని తెలిపారు. అక్రమంగా రేషన్‌ బియ్యం తరలించిన ఇద్దరు వ్యక్తులతోపాటు రెండు టీవీఎస్‌ మోటార్‌సైకిళ్లను పట్టుకుని కోటనందూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించామని తెలిపారు. మిల్లు యజమాని రాంబాబు, శ్రీనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు సత్యకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, ప్రసాద్‌ రామారావు, అలీషా పాల్గొన్నారు.

Updated Date - 2021-07-23T07:20:46+05:30 IST