ఫిన్లాండ్‌కు భారత రాయబారిగా రవీశ్ కుమార్ నియామకం

ABN , First Publish Date - 2020-06-04T00:22:45+05:30 IST

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అధికార ప్రతినిథి రవీశ్ కుమార్‌ను

ఫిన్లాండ్‌కు భారత రాయబారిగా రవీశ్ కుమార్ నియామకం

న్యూఢిల్లీ : విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అధికార ప్రతినిథి రవీశ్ కుమార్‌ను ఫిన్లాండ్‌కు భారత రాయబారిగా నియమించినట్లు భారత ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 


రవీశ్ కుమార్ 1995 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 2017 జూలై నుంచి 2020 ఏప్రిల్ వరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథిగా సేవలందించారు. ఈ సమయంలో ఆయన అనేక సున్నితమైన అంశాలపై భారత దేశ వైఖరిని, విధానాలను సుస్పష్టంగా వెల్లడించారు. బాలాకోట్ దాడులు, జమ్మూ-కశ్మీరును కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం, జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ) వంటి అనేక సున్నితమైన అంశాలపై ఆయన స్పష్టంగా వివరించారు. 


 ఫిన్లాండ్‌కు భారత రాయబారి పదవిని రవీశ్ కుమార్ త్వరలోనే చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. 


రవీశ్ కుమార్ గతంలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత దేశ కాన్సుల్ జనరల్‌గా పని చేశారు. 


Updated Date - 2020-06-04T00:22:45+05:30 IST