నేడు ‘పురం’లో రాయలసీమ నేతల సదస్సు

ABN , First Publish Date - 2021-10-17T05:53:58+05:30 IST

నీటి వనరుల్లో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా జలాలు-రాయలసీమ హక్కుల సాధన చర్చావేదిక సదస్సును స్థానిక జేవీఎస్‌ ఫంక్షన హాల్‌లో ఆదివారం నిర్వహించనున్నా రు.

నేడు ‘పురం’లో రాయలసీమ నేతల సదస్సు
సదస్సు ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీకే, టీడీపీ నేతలు

అన్యాయాన్ని ప్రశ్నించలేని జగన 

 సీఎం వైఫల్యంతో రాయలసీమకు తీరని అన్యాయం  

 బీకే మండిపాటు

హిందూపురం, అక్టోబరు 16: నీటి వనరుల్లో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా జలాలు-రాయలసీమ హక్కుల సాధన చర్చావేదిక సదస్సును స్థానిక జేవీఎస్‌ ఫంక్షన హాల్‌లో ఆదివారం నిర్వహించనున్నా రు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారధి.. పార్టీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వాటిల్లుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని స్థితిలో ముఖ్యమంత్రి జగన ఉన్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయాయన్నారు. ముఖ్యమంత్రి వైఫల్యంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో 107 కేంద్రం పర్యవేక్షణలోకి వెళ్లాయన్నారు. జగన మొద్దునిద్రతో తెలంగాణకు ధారదత్తం చేస్తూ రాయలసీమను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. హంద్రీనీవా పథకాన్ని తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌దనీ, పథకానికి 2014నుంచి 2019 టీడీపీ హ యాంలోనే రూ.4వేల కోట్ల ఖర్చు పెట్టి చంద్రబాబు కృషితో జిల్లాకు కృష్ణాజలాలు వచ్చాయన్నారు. హంద్రీనీవా రాకతో జిల్లా వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడిందన్నారు. జగన అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో హంద్రీనీవాపై నయా పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. రా యలసీమ నీటి ప్రాజెక్టులను రక్షించుకునేందుకు టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. ఈనేపథ్యంలో రాయలసీమకు నికర జలాల హక్కుల సాధన పోరాటంతో భాగంగా రాయలసీమ టీడీపీ నేతలతోపా టు మేధావులు, రైతులతో చర్చావేదిక నిర్వహించి, చైతన్యం తీసుకువస్తామన్నారు. సదస్సుకు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూ రు జిల్లాలకు చెందిన ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మా జీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇనచార్జ్‌లు, పార్లమెంటు కమిటీల అధ్యక్షులు, నేతలతోపాటు మేధావులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో పార్టమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయ ణ, నాయకులు నాగరాజు, చిలమత్తూరు మండల కన్వీనర్‌ రంగారెడ్డి, పార్లమెంటు మహిళ కమిటీ ఉపాధ్యక్షురాలు వడ్డే శ్రీదేవి, ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్‌ పాపన్న, చంద్రమోహన యాదవ్‌, లక్ష్మీదేవమ్మ, చంద్రశేఖర్‌, మం జునాఽథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:53:58+05:30 IST