నేను సందేహించాను

ABN , First Publish Date - 2020-06-05T10:22:32+05:30 IST

‘కనిగిరి పట్టణంలో పేదలకు నివాస స్థలాల కోసం సేకరించిన భూ మికి ధర నిర్ణయించే విషయంలో నేను సందేహించాను.

నేను సందేహించాను

అంత ధర ఉంటుందా అని అనుకున్నా..

కనిగిరి పేదల స్థలాల భూమిపై 

ఆర్డీఓ బీసీహెచ్‌ ఓబులేసు


కందుకూరు, జూన్‌ 4: ‘కనిగిరి పట్టణంలో పేదలకు నివాస స్థలాల కోసం సేకరించిన భూ మికి ధర నిర్ణయించే విషయంలో నేను సందేహించాను. అంత ధర ఉంటుందో లేదోనని సంశయించాను.. అయితే అప్పటి జేసీనే స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడి ఆయనకున్న విచక్షణ అధికారాలతో ఆ ధర నిర్ణయించారు’ అని కందుకూరు ఆర్డీఓ బీసీహెచ్‌ ఓబులేసు తెలిపారు. జేసీ వెంకటమురళి భూముల పరిశీలనకు వచ్చిన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్డీఓ ఈ సమాధానమిచ్చారు. రూ.30వేలలోపు మార్కెట్‌ విలువ కలిగిన భూములను కొందరు ప్రణాళిక ప్రకారం కొనుగోలు చేసుకుని ప్రభుత్వానికి ఎకరం పదమూడు, పధ్నాలుగు లక్షల చొప్పు న ఇచ్చారని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి కదా అని ప్రశ్నించగా ఆర్డీఓ ఆ సమాధానమిచ్చారు.


అయితే చేసేది మాత్రం నిబంధనలకు లోబడి మాత్రమే చేశామని చెప్పారు. మా ర్కెట్‌ ధర కన్నా రెండున్నర రెట్లు అదనంగా రైతులకు చెల్లించమని నిబంధనలు ఉన్నాయని, జేసీ స్వయంగా రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను అనుసరించి అంతకన్నా ఎక్కువ కూడా చెల్లించేందుకు అవకాశం ఉందని ఆ నిబంధనను అనుసరించే  అక్కడ ధర నిర్ణయించామని ఆయన వివరించారు.భూసేకరణ ద్వారా భూమి తీసుకుని నివాస స్థలాల లే అవుట్లు సిద్ధ్దం చేస్తున్నది కనిగిరి నియోజకవర్గంలోనే అధికంగా ఉందని, మిగిలినచోట్ల అవకాశం ఉన్నంతవరకు ప్రభుత్వ భూములనే గుర్తించామని ఆర్డీఓ వివరించారు. 

Updated Date - 2020-06-05T10:22:32+05:30 IST