వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకోండి

ABN , First Publish Date - 2021-06-20T05:52:27+05:30 IST

రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్‌ గణపతి పేర్కొన్నారు. శనివారం ఆయన మెప్మా కార్యాలయంలో మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, బి.కొత్తకోట, పీటీఎం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు.

వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎల్డీఎం గణపతి

లీడ్‌బ్యాంకు మేనేజర్‌ 


మదనపల్లె క్రైం, జూన్‌ 19: రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్‌ గణపతి పేర్కొన్నారు. శనివారం ఆయన మెప్మా కార్యాలయంలో మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, బి.కొత్తకోట, పీటీఎం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ... వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారులు సమన్వయం చేసుకుని అర్హులైన రైతులకు పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో 2021-22 సంవత్సరానికి రూ.22 వేలకోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హులైన రైతులకు దీర్ఘ, మధ్యకాలిక రుణాలు మంజూరు చేయాలన్నారు.  గత ఏడాది బ్యాంకు లింకేజీ, జగనన్నతోడు తదితర రుణాలు అందని మహిళా సంఘాలకు ఈ ఏడాదిలోగా పంపిణీ చేస్తామన్నారు. నాబార్డు డీజీఎం సునీల్‌ మాట్లాడుతూ... ఈ ఏడాది టర్మ్‌ లోన్ల లక్ష్యం 28.29 శాతం కాగా, వచ్చే ఏడాది 40 శాతానికి పెంచుతామన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ క్రెడిట్‌కు సంబంధించి పౌల్ర్టీ, డెయిరీ, ఫిషరీస్‌, ట్రాక్టర్లు, పండ్ల తోటల పెంపకానికి పెట్టుబడి పెంచేలా కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి టర్మ్‌లోన్లు రూ.4,250 కోట్లు లక్ష్యం కాగా, సుమారు రెండులక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. నాబార్డు నుంచి రైతులకు పంట రాయితీ వచ్చేనెలలో వస్తుందన్నారు. అంతకుముందు కొవిడ్‌తో మరణించి బ్యాంకు అధికారుల మృతికి రెండునిమిషాలు మౌనం పాటించారు.  స్థానిక ఇండియన్‌ బ్యాంకు మేనేజర్‌ మూర్తిప్రసాద్‌, మెప్మా మేనేజర్‌ మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:52:27+05:30 IST