‘భూకబ్జా నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం’
ABN , First Publish Date - 2021-08-04T04:07:16+05:30 IST
నర్సంపల్లి భూముల్లో మంత్రి హరీశ్‌రావు, తన ప్రమేయం ఉన్నట్లు సంధ్యారాణి చేసిన ఆరోపణల్లో నిజం లేదని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ పేర్కొన్నారు.
తూప్రాన్, ఆగస్టు 3: నర్సంపల్లి భూముల్లో మంత్రి హరీశ్‌రావు, తన ప్రమేయం ఉన్నట్లు సంధ్యారాణి చేసిన ఆరోపణల్లో నిజం లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో మీడియాలో ప్రసారాలు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. మంగళవారం తూప్రాన్‌లో చంద్రాగౌడ్ మాట్లాడారు. సంధ్యారాణి ఆరోపిస్తున్న నర్సంపల్లి భూములు ఎక్కడున్నాయో తనకు తెలియవన్నారు. మంత్రి హరీశ్‌రావుపైనా, తనపైనా చేసిన ఆరోపణలు రుజువు చేస్తే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని, అవాస్తవాలు, ఆరోపణలు చేసిన వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.