బాధితుల ఫిర్యాదులను స్వీకరించండి

ABN , First Publish Date - 2021-05-11T05:46:11+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే ప్రతి కాల్‌ను సీరియ్‌సగా తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు.

బాధితుల ఫిర్యాదులను స్వీకరించండి

- సబ్‌ కలెక్టర్‌ నిషాంతి 

పెనుకొండ టౌన, మే 10: కరోనా నియంత్రణలో భాగంగా కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే ప్రతి కాల్‌ను సీరియ్‌సగా తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ డివిజనలోని 13 మండలాల తహసీల్దార్‌లతో స్థానిక కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే 13 మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, ప్రతి కంట్రోల్‌ రూమ్‌కు ఒక అధికారిని నియమించడం జరిగిందన్నారు. కరోనా బాధితులు కానీ, ఏదైనా సమస్యలతో కంట్రోల్‌ రూమ్‌కు ఫోనచేస్తే తక్షణం ఆయా ప్రాంతాల అఽధికారులను అప్రమత్తం చేసి చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే హిందూపురం ఆసుపత్రిలో కరోనా బాదితులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచలతో మాట్లాడి శానిటైజేషన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, సురేష్‌ తదితరులు మాట్లాడారు. 


Updated Date - 2021-05-11T05:46:11+05:30 IST