Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమాజ సేవ చేసినప్పుడే గుర్తింపు

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ 


బ్రహ్మంగారిమఠం, డిసెంబరు 4: స్వార్థం లేకుండా సమాజ సేవ చేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మినారాయణ తెలిపారు. శనివారం బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని స్థానిక యాదవ సమాజ అన్నదాన సంఘంలో జ్ఞానసరస్వతీదేవి ఛారిటబుల్‌ ట్రస్టు 8వ వార్షికోత్సవాన్ని సంస్థ ఛైర్మన్‌ యనమల శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు చిప్పగిరిప్రసాద్‌, మాజీ ఆర్మీ అధికారి ఏవీకే నాయుడు, జిల్లా సర్వశిక్షా అభియాన్‌ అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరోనా సమయంలో వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలకు సేవ చేసినందుకు నేడు జాతీయ అవార్డులను జ్ఞానసరస్వతి చారిటబుల్‌ ట్రస్టు ఛైర్మన్‌ యనమల శ్రీనివాస్‌యాదవ్‌ అందజేయడం గొప్ప విషయమన్నారు. సమాజాన్ని ఆనందంగా ఉంచడమే లక్ష్యంగా ప్రతి వ్యక్తి పాటుపడాలన్నారు. అనంతరం జాతీయ అవార్డులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ప్రముఖుల చేత అందజేశారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement