ధర్మపురిలో తగ్గిన గోదావరి ఉదృతి

ABN , First Publish Date - 2022-07-16T06:40:48+05:30 IST

ధర్మపురిలో గోదావరి వరద ఉదృతి శుక్రవారం తగ్గుముఖం పట్టింది.

ధర్మపురిలో తగ్గిన గోదావరి ఉదృతి
ధర్మపురిలో తగ్గిన గోదావరి ఉదృతి

- నీట తేలిన ఆలయాలు, స్నాన ఘట్టాలు

- కొనసాగుతున్న సహాయక చర్యలు

దర్మపురి, జూలై, 15 : ధర్మపురిలో గోదావరి వరద ఉదృతి శుక్రవారం తగ్గుముఖం పట్టింది. దీంతో ధర్మపురిలో గోదావరిలో గత రెండు రోజుల క్రితం నీట మునిగిన స్నాన ఘట్టాలు, పలు ఆలయాలు తేలాయి. కడెం ప్రాజెక్టు నుంచి దిగువకు సాయంత్రం 5 గంటల వరకు 16 గేట్ల ద్వారా 18,679 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహా యక చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరి నది ఒడ్డున విద్యుత్‌ సరఫరా పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల నుంచి పలువురు వరద బాధితులు ఇంటికి చేరుతున్నారు. కాగా వర్షం తగ్గినప్పటికీ వరద కొనసాగడం వల్ల మండ లంలోని నాగారాం, ఆకుసాయిపల్లె మద్య రోడ్డు తెగిపోయింది. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు. 


 


Updated Date - 2022-07-16T06:40:48+05:30 IST