‘నగర మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి’

ABN , First Publish Date - 2020-06-04T10:28:15+05:30 IST

నగర ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌ ప్రజలకు ఆమో దయోగ్యమైన రీతిలో లేదని, నూతనంగా తయారు చేస్తున్న

‘నగర మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి’

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 3: నగర ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌ ప్రజలకు ఆమో దయోగ్యమైన రీతిలో లేదని, నూతనంగా తయారు చేస్తున్న మాస్టర్‌ప్లాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నగర అభివృద్ధి కమిటీ ప్రతినిధులు నగర కమిషనర్‌ జీతేష్‌ వి పాటిల్‌ను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. నూతనంగా నుడా పరిధిలో వచ్చిన గ్రామాలను కలుపుకుని మాస్టర్‌ప్లాన్‌ తయారు చేస్తున్నందునా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని కోరారు.


1974లో వినాయక్‌నగర్‌ నుంచి రే డియో స్టేషన్‌ వర్ని రోడ్డు, ఖిల్లా మీదుగా బోధన్‌ రోడ్డు వరకు 100ఫీట్ల రోడ్డు ప్రతిపాధించారని, 46ఏళ్లు గడచినా ఆ రోడ్డు వేయలేదని, ఆ ప్రాంతమంతా ఇళ్ల నిర్మా ణం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు ఏమి లేవన్నారు. అనేక ప్రాంతాల్లో గల్లీ ల్లోని ఇళ్లకు అనుమతులిస్తూ 40ఫీట్ల రోడ్లను 60, 80ఫీట్లుగా మారుస్తూ ప్రతిపాదించారని, దీంతో పేదవారు నష్టపోతున్నారని వారు తెలిపారు. కమిషనర్‌ను కలిసి న వారిలో కమిటీ గౌరవ అధ్యక్షుడు గజవాడ హన్మంత్‌రావ్‌, ఆకుల ప్రసాద్‌, రా మ్మోహనరావ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-06-04T10:28:15+05:30 IST