Abn logo
Aug 5 2020 @ 04:26AM

గాయత్రి పంపుహౌస్‌ నుంచి నీటి విడుదల

6300 క్యూసెక్కుల నీరు ఎస్సారార్‌ జలాశయానికి తరలింపు


రామడుగు, ఆగస్టు 4: రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గాయత్రి పంపుహౌస్‌ నుంచి మంగళవారం రాత్రి అధికారులు నీటిని విడుదల చేశారు. పంపుహౌస్‌లోని 2, 3 బాహుబలి పంపుల ద్వారా గ్రావిటీ కెనాల్‌ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేశారు. వరద కాలువ నుంచి పరవళ్లు తొక్కుతూ ఎస్సారార్‌ జలాశయానికి నీరు వెళ్తున్నది. రెండు పంపుల ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని జలాశయానికి తరలించనున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల కొనసాగుతుందని వారు వివరించారు. 

Advertisement
Advertisement