జనావాసాల్లో సెల్‌ టవర్‌ తొలగించండి

ABN , First Publish Date - 2021-08-04T05:04:12+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా తహసీల్దార్‌ కార్యాల యం రోడ్డులో జనావాసాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ సెల్‌ టవర్‌ను తొలగించాలని మహిళలు, యువకులు మంగళవారం కేటీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్‌ పైల జవహర్‌ మాట్లాడుతూ.. నివాస స్థలాల్లో సెల్‌ టవర్లు ఏర్పాటు చేయ కూడదన్న నిబంధనలు బేఖాతర్‌ చేసి రోడ్డు పక్కనే ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయడం తగదన్నారు.

జనావాసాల్లో సెల్‌ టవర్‌ తొలగించండి
కేటీరోడ్డుపై ఆందోళన చేస్తున్న ప్రజలు

కేటీ రోడ్డుపై బైఠాయించి నిరసన

పలాస, ఆగస్టు 3:  నిబంధనలకు విరుద్ధంగా తహసీల్దార్‌ కార్యాలయం రోడ్డులో జనావాసాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ సెల్‌ టవర్‌ను తొలగించాలని మహిళలు, యువకులు మంగళవారం కేటీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్‌ పైల జవహర్‌ మాట్లాడుతూ.. నివాస స్థలాల్లో సెల్‌ టవర్లు ఏర్పాటు చేయ కూడదన్న నిబంధనలు బేఖాతర్‌ చేసి రోడ్డు పక్కనే ప్రైవేటు స్థలంలో  ఏర్పాటు చేయడం తగదన్నారు. సెల్‌టవర్‌ రేడియేషన్‌ వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే తొలగించక పోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై గంటపాటు బైఠాయిం చడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది, అనంతరం ర్యాలీ నిర్వహించి మునిసిపల్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రాలు అందజేశారు స్థానికులు టి.స్వాతి, లత, పద్మ, ధనం,  పాల్గొన్నారు. 


నిలిపివేయాలని ఆదేశించాం

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ సెల్‌టవర్‌ ఏర్పాటు నిలిపి వేయాలని ఆదేశాలు జారీచేసినట్లు మునిసి పల్‌ కమిషనర్‌ రాజగోపాల రావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 2019లో సెల్‌టవర్‌ నిర్మాణానికి అను మతులిచ్చారని, అయితే ఏడాదిలో దాన్ని నిర్మించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం దాని నిర్మాణం చేపట్టడంతో  ప్రజల ఆందోళనలు, వినతులను పరిశీలించి తక్షణమే నిలిపివేయాలని ఆదేశించామన్నారు.

  

Updated Date - 2021-08-04T05:04:12+05:30 IST