ఎస్సారెస్పీకి మరమ్మతులు

ABN , First Publish Date - 2022-06-19T07:03:19+05:30 IST

శ్రీరామ్‌సాగర్‌ గేట్ల మరమ్మతుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రాజెక్టు గేట్లతో పాటు వరద కాల్వ గేట్ల మరమ్మత్తులను ఈ నిధులతో చేపట్టనున్నా రు. సంవత్సరంలోపు మరమ్మతు ప నులను పూర్తిచేయనున్నారు. ఈ ప నులను చేయడంతో పాటు గేట్లకు అవసరమైన ఇతర సామగ్రిని కూడా మార్చనున్నారు. వరదలు వచ్చే సమయంలో ఇబ్బందులు లేకుండా గేట్లను

ఎస్సారెస్పీకి మరమ్మతులు
నిండు కుండలా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఫైల్‌)

ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతుల కోసం రూ.17 కోట్ల నిధులు విడుదల

నేడు అధికారికంగా పనులను ప్రారంభించనున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీరామ్‌సాగర్‌ గేట్ల మరమ్మతుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రాజెక్టు గేట్లతో పాటు వరద కాల్వ గేట్ల మరమ్మత్తులను ఈ నిధులతో చేపట్టనున్నా రు. సంవత్సరంలోపు మరమ్మతు ప నులను పూర్తిచేయనున్నారు. ఈ ప నులను చేయడంతో పాటు గేట్లకు అవసరమైన ఇతర సామగ్రిని కూడా మార్చనున్నారు. వరదలు వచ్చే సమయంలో ఇబ్బందులు లేకుండా గేట్లను తెరుచుకునేవిధంగా మరమ్మతు పనులను పూర్తి చేయనున్నారు. వర్షాకాలం మొదలై ఇప్పటికే కొద్దిగా వరద ప్రారంభం కావడంతో పనుల ను చేపట్టేందుకు అదికారులు నిర్ణయించారు. కాగా, ఆదివారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరాంసారగ్‌ ప్రాజెక్టు మరమ్మతు పనులను ప్రారంభించనున్నారు. 

గతేడాది మొరాయించిన వరద గేట్లు

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు చేపట్టినపుడు 42గేట్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ గేట్లు ప్రతి సంవత్సరం వరద వచ్చే స మయంలో తెరుస్తున్నారు. వరదలకు ముందు చిన్న చిన్న మరమ్మతులను చేస్తూ గేట్లు తెరచుకునేవిధంగా చూస్తున్నారు. గత సంవత్సరం భారీ వరదలు వచ్చే సమయంలో ఆరు గేట్లు తెరిచేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద భారీగా వచ్చిన సమయంలో ఇవి సతాయించడంతో మెకానిక్‌లను పిలిచి తాత్కాలికంగా మరమ్మతు లను చేశారు. గేట్ల పనితీరుపైన ప్రభుత్వానికి నివేదికలు పంపించా రు. నిధులు విడుదల చేయాలని కోరారు. మొత్తం గేట్ల మరమ్మతు లను చేపట్టేందుకు ప్రణాళికను ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్ర ణాళికకు అనుగుణంగా రూ.17కోట్లను ప్రధాన గేట్లతో పాటు వరద కాల్వ గేట్ల కోసం ప్రభుత్వం విడుదలచేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎస్సారెస్పీ అధికారులు గేట్ల మరమ్మతు కోసం టెండర్‌లను పిలిచి ఓకే చేశారు. పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 

1983 నుంచి ఆయకట్టకు సాగునీరు

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు పూర్తయి 1983 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ సంవత్సరం నుంచే ఆయకట్టు కు సాగునీరును అందిస్తున్నారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాల్వల ద్వారా నీటిని ఆయకట్టుకు ఇస్తున్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి 39ఏళ్లు పూర్తయింది. అప్పుడు పెట్టిన గేట్లే ఇప్పుడు పనిచేస్తున్నాయి. కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు హైడ్రాలిక్‌ గేట్లను ఏర్పాటు చే స్తుండగా ఈ ప్రాజెక్టు మాత్రం పాత పద్దతిలోనే గేట్లను ఏర్పాటు చే శారు. వరదల సమయంలో మనుషుల సహాయంతోనే గేట్లను ఎత్తుతున్నారు. ఈ ప్రాజెక్టుకు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్స రం జూన్‌ నెల నుంచి అక్టోబర్‌ వరకు వరద లు వస్తుండడంతో ప్రాజెక్టు గేట్లు కనీసం 15 నుం చి 2 నెలల పాటు తెరిచే ఉంచుతున్నా రు. ప్రతీ సంవత్సరం ప్రాజెక్టు గేట్లతో పాటు వరద గేట్లను ఎత్తుతున్నారు. ప్రాజెక్టు పెట్టినప్పటి నుంచి ఆరేళ్లు మినమా మిగత 33 ఏళ్లు పూర్తిస్థాయిలో నిండింది. భారీగా వరద నీరు గోదావరిలోకి విడుదల చేశారు. గత సంవత్స రం కూడా 460 టీఎంసీలకుపైగా నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. గత సంవత్సరం వ రదలు వచ్చే సమయంలో ఆరు గేట్లు ఇబ్బం దులు వల్ల పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఈ పనులను చేపడుతున్నారు.

గేట్లు తుప్పు పట్టకుండా రంగులు

ఎస్సారెస్పీ గేట్ల మొత్తం మరమ్మతులు చేయనున్నారు. గేట్లకు ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన విడి భా గాలను వేస్తారు. గేట్లన్ని తుప్పు పట్టకుండా రంగులు వేస్తారు. గేట్ల కు అవసరమైన పరికరాలను ఈ నిధులను వెచ్చించి బిగిస్తారు. మరో పదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు గేట్లకు ఏర్పడకుండ ఈ మరమ్మతులను చేస్తారు. ఈ గేట్లకు అవసరమైన పంపులను కూడా బాగుచేస్తారు. వరదలు భారీగా వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బం దులు ఎదుర్కోకుండా తెరచుకునేవిధంగా ఈ మరమ్మతులు పూర్తి చేస్తారు. వీటితో పాటు భారీ వరదలు వచ్చిన సమయంలో వరద కాల్వకు నీటిని విడుదలచేసే గేట్ల మరమ్మతులను కూడా పూర్తిచేయనున్నారు. గడిచిన కొన్ని రోజులుగా ప్రాజెక్టు ఎగువన వర్షాలు ప డుతుండడంతో కొంతమొత్తంలో వరద వచ్చి చేరుతుంది. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 0.842 టీఎంసీల వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో ప్రస్తు తం 1091 అడుగులకుగాను 1064.8 అడు గుల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 19.918 టీఎం సీల నీళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రాంతంలో వర్షాలు ఎక్కువడి పడి తే వరద పెరిగే అవకాశం ఉండడంతో ఈ పనులు చేపట్టేందుకు అదికారులు సిద్ధమయ్యారు.

ఏరాట్లు పూర్తి చేసిన అధికారులు

ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను అధికారికంగా ఆదివారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. జిల్లా మంత్రి వస్తుండడంతో ఎస్సారెస్పీ అధికారులు ప్రాజెక్టుపైన అన్ని ఏర్పాట్లను చేశారు. మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణిలు తెలిపారు. ఆ పనులను అదికారికంగా మంత్రి ప్రారంభిస్తారని, సంవత్సరంలోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-19T07:03:19+05:30 IST