Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు

- డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య

పెద్దపల్లి రూరల్‌, డిసెంబరు 3 : రైతులు పండించిన పంటను అమ్మేందుకు ప్రభుత్వా లు నానా ఇబ్బందులు పెడుతున్నాయని, ప్ర భుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి ధాన్యం నిల్వలు ఉంటున్నా యని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అన్నారు. శుక్రవారం మండలంలో ని అప్పన్నపేటలో సింగిల్‌ విండో ద్వారా ఏర్పా టుచేసిన వరిధాన్యం కోనుగోలు కేంద్రాన్ని సం దర్శించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లా డి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో దళారులు నిలు వునా దోచుకుంటున్నారని, సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటూ రైతుల ఉసురు తీస్తున్నారన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్లపై ధర్నాలు చేసే దౌర్భగ్య పరిస్థితి ఉందన్నారు. రైతులకు న్యా యం జరిగే వరకు అండగా కాంగ్రెస్‌ పార్టి ఉంటుందని , ప్రభుత్వం ధా న్యం కోనుగోలు చేసే వరకు పొ రాటం చేస్తామ న్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి విజ య్‌కుమార్‌, వే ముల రాజు, పరమేశ్వర్‌, రా జేష్‌, గుర్రాల రాజు, ప్రశాంత్‌, మాధవరెడ్డి, కుమార్‌తోపాటు రైతులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement