కాల్‌ సెంటర్‌కొచ్చే సమస్యలపై తక్షణం స్పందించండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-18T06:11:53+05:30 IST

‘కలెక్టరేట్‌లోని 104 కాల్‌ సెంటర్‌కొచ్చే ప్రతి సమస్యపైనా తక్షణం స్పందించండి. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందన్న భరోసాను కల్పించాలి’ అని అధికారులను కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.

కాల్‌ సెంటర్‌కొచ్చే సమస్యలపై తక్షణం స్పందించండి: కలెక్టర్‌
సమావేశంలో ప్రసంగిస్తున్న హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మే 17: ‘కలెక్టరేట్‌లోని 104 కాల్‌ సెంటర్‌కొచ్చే ప్రతి సమస్యపైనా తక్షణం స్పందించండి. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందన్న భరోసాను కల్పించాలి’ అని అధికారులను కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేషన్‌, హెల్ప్‌ డెస్క్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, హోమ్‌ ఐసొలేషన్‌ అంశాలపై సంబంధిత నోడల్‌ అధికారులతో విడివిడిగా సమీక్షించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ఆరోగ్యశ్రీ కింద కేటాయించాలని చెప్పారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఆడిట్‌ రోజూ జరగాలని సూచించారు. హోమ్‌  ఐసొలేషన్‌ కిట్లు లేకుంటే, అవసరమైన మందులను సమీప పీహెచ్‌సీల నుంచి తీసుకొచ్చి బాధితులకు అందించాలన్నారు. హోమ్‌ ఐసొలేషన్‌లోని బాధితుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డీఎంహెచ్‌వో పెంచలయ్య, డీపీఎంవో శరవణ  శ్రీనివాస్‌, నోడల్‌ అధికారులు రమాదేవి, అరుణకుమారి, రమేష్‌రెడ్డి, భవాని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T06:11:53+05:30 IST