స్పందన అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-25T04:33:02+05:30 IST

స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.

స్పందన అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్‌

కడప (కలెక్టరేట్‌), జనవరి 24: స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పంద న హాలులో అర్జీల పురోగతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు, కొవిడ్‌ ప్రొటోకాల్‌ తదితర అంశాలపై  అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యలకు గడువులోగా పరిష్కారం చూపించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్పందన అర్జీల లాగిన్‌లో చెక్‌ చేసుకోవాలన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వాహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ రూపొందించిన డైరీని, క్యాలెండరును కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యాన్‌చంద్ర, డీఆర్వో మలోల, కంట్రోల్‌ రూమ్‌ ఓఎస్డీ రఘునాథ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:33:02+05:30 IST